Sumathi Satakam in Telugu 32235 Sumathi Satakalu

Sumati satakam

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu మాటకు బ్రాణము సత్యము

Get the Sumathi Satakam మాట్లడే మాటలకు సత్యమే జీవం. కోటను రక్షించే భటులే కోటకు ఆధారం. స్త్రీకి మానమే ముఖ్యం. ఉత్తరం చివర చేసే సంతకమే దానికి అధికారికతనిస్తుంది. In Telugu Sumathi Satakalu

సుమతీ శతకం-30

Posted: 03/02/2012 05:14 PM IST
Sumati satakam

sumati

మాటకు బ్రాణము సత్యము

కోటకు బ్రాణంబు సుభటకోటి ధరిత్రిన్

బోటికి బ్రాణము మానము

చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ

మాటకు= చెప్పే మాటలకు, బ్రాణము=జీవం, సత్యము= సత్యం, కోటకు బ్రాణంబు= కోటకి ఆయువుపట్టు, సుభటకోటి- మంచి భటుల సముదాయం, బోటికి బ్రాణము- స్త్రీకి ముఖ్యం, మానము- పవిత్రత, చీటికి బ్రాణంబు= ఉత్తరానికి ముఖ్యం, వ్రాలు= సంతకం.

మాట్లడే మాటలకు సత్యమే జీవం. కోటను రక్షించే భటులే కోటకు ఆధారం. స్త్రీకి మానమే ముఖ్యం. ఉత్తరం చివర చేసే సంతకమే దానికి అధికారికతనిస్తుంది.

సత్యంతో కూడిన మాటలకే విలువుంటుంది. ఆ మాటలే శక్తివంతంగా ఉంటాయి. వారే సత్యసంధులు అనబడతారు. అలా సత్యంతో కూడిన పలుకులను పలికేవారికే వాక్సుద్ధి లభిస్తుంది. వారి మాటలు నిజమౌతాయి. జరిగితీరుతాయి. ఈ విషయాన్ని అర్థమయ్యేట్టుగా చెప్పటానికి మిగిలిన ఉదాహరణలిచ్చారు శతకకర్త.

ఎంత పటిష్టమైన కోట కట్టించినా దాన్ని రక్షించే భటులు లేకపోతే అది నిరుపయోగమే. అధికారులు ఇచ్చే ఆదేశాలకే కాదు, రాసి ప్రకటించే ఏ పత్రానికైనా కింద సంతకం లేకపోతే దానికి విలువే ఉండదు. ఈ ఉదాహరణల ద్వారా మనమాటలకు కూడా విలువుండాలంటే అవి శక్తివంతంగా మారాలంటే సత్యాన్నే పలకాలని శతకకర్త చెప్తున్నారు. మాటకు అంత శక్తి ఉండబట్టే మహాత్ముల దీవెనలు కానీ శాపాలు కానీ పనిచేస్తాయని పూర్వకాలం నుంచీ మనం నమ్ముతూ వస్తున్నాం. అటువంట్ శక్తి వారు ఉచ్ఛరించే మాటలకు ఎలా వచ్చిందంటే వారి సత్యభాషణమే అందుకు కారణం.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sumati satakam
Sumati satakam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more