Sumathi Satakam in Telugu 32272 Sumathi Satakalu

Sumati satakam

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu మండలపతి సముఖంబున

Get the Sumathi Satakam భీకరాకారంతో కొండంత ఎత్తున ఉన్న ఏనుగుకి తొండం లేకపోతే ఎలా ఉంటుందో, మంత్రి లేని రాజు కూడా అలాగే ఉంటాడని చెప్పారు. ఈ పద్యంలో కూడా శతకకర్త రాజుకి మంత్రి అవసరాన్ని తెలియజేసారు. In Telugu Sumathi Satakalu

సుమతీ శతకం-31

Posted: 03/03/2012 05:04 PM IST
Sumati satakam

sumati-03

మంత్రి గలవాని రాజ్యము

తంత్రము చెడకుండ నిలుచు దఱచుగ ధరలో

మంత్రి విహీనుని రాజ్యము

జంత్రపు గీ లూడినట్లు జరుగద సుమతీ

మంత్రిగలవాని రాజ్యము=సరియైన మంత్రి ఉన్నరాజ్యంలో, తంత్రము=రాజకీయ విధానాలు రాచరికపు పనులు, చెడకుండ నిలుచు= చెడిపోకుండా నడుస్తాయి, మంత్రి విహీనుని రాజ్యము=మంత్రి లేనివాని రాజ్యము, జంత్రపు- యంత్రంలోని, కీలూడినట్లు=మర ఊడిపోయినట్లుగా, జరుగదు=ముందుకి నడవదు.

పూర్వకాలం రాజులు పరిపాలించే కాలంలో వారికి సలహాలు ఇవ్వటానికి మంత్రి లేక మంత్రులుండేవారు. పాలించే రాజు ధ్యాసంతా రాజ్య విస్తరణ, బలగాలు కూడదీసుకోవటం, దండయాత్రలు చెయ్యటం, యుద్ధ పటిమను పెంచుకోవటం లాంటి విషయాల్లోనే ఉంటుంది కాబట్టి, ఇలాంటివేమీ చెయ్యకుండా తనకున్న పాండిత్యము, అనుభవము, ఙానంతో రాజకీయపుటెత్తులు, రాజ్యంలో అంతర్గత భద్రత, ప్రజలకు సౌఖ్యం లాంటి విషయాలమీద సమయాన్ని వెచ్చించే మంత్రి ఉన్నట్లయితే ఆ రాజ్యం బాగా నడుస్తుంది. లేకపోతే యంత్రం (మెషీన్) లో మర ఊడిపోతే సరిగ్గా నడవకపోవటం ఎలాగైతే జరుగుతుందో అదే విధంగా రాజ్యపాలన కూడా సక్రమంగా జరగదు.

ఇదే విషయాన్ని మరో పద్యం లో కూడా మరో విధంగా వివరించారు శతక కర్త.

మండలపతి సముఖంబున

మెండైన ప్రధాని లేక మెలగుట యెల్లన్

గొండంత మదపు టేనుగు

తొండము లేకుండినట్లు దోచుర సుమతీ

మండలపతి సముఖంబున=రాజ్యమేలే రాజు దగ్గర, మెండైన ప్రధాని లేక=సరైన మంత్రి, లేక మెలగుట యెల్లన్=లేకుండా ఉన్నట్లయితే, కొండంత మదపుటేనుగు=పెద్ద ఆకారం గల ఏనుగు, తొండము లేకుండినట్లు=తొండం లేకుండా ఉన్నట్లే, తోచుర=కనిపిస్తుంది.

భీకరాకారంతో కొండంత ఎత్తున ఉన్న ఏనుగుకి తొండం లేకపోతే ఎలా ఉంటుందో, మంత్రి లేని రాజు కూడా అలాగే ఉంటాడని చెప్పారు. ఈ పద్యంలో కూడా శతకకర్త రాజుకి మంత్రి అవసరాన్ని తెలియజేసారు.

పాలించేవారికి మంత్రి ఎలా అవసరమో అలాగే సంసారమనే సమిష్టి జీవితంలో కూడా బయట వ్యవహారాలను చక్కబెడుతూ కుటుంబాన్ని అభివృద్ధి చేయాలనే కృషిలో ఉన్న ఇంటి పెద్దకు అతని భార్య కూడా మంత్రి లాగానే వ్యవహరిస్తూ ఇంటి పనులను నిర్వహిస్తుంది. పనిలో నిమగ్నమైన వారికి వెనక నుంచి ప్రశాంతంగా అన్నీ కనిపెడుతూ సలహాల నిచ్చేవారుండటం చాలా అవసరం. అందుకే ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనే సామెత కూడా వచ్చింది. ఆధునిక రాజకీయ రంగంలో కూడా రాజుల స్థానంలో మంత్రులు పనిచేస్తున్నారు కాబట్టి వారికి వివిధ శాఖలకు చెందిన సలహాదారులు ఉంటున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sumati shatakam
Sumati satakam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more