Sumathi Satakam in Telugu 32199 Sumathi Satakalu

Sumati satakam

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu శుభముల నొందని చదువును

Get the Sumathi Satakam చదివే చదువు వలన ఉపయోగం లేకపోయినా, రాగయుక్తంగా భావాన్ని పలికిస్తూ పాట పాడకపోయినా, కలిసిన బృందం ఆసక్తికరంగా లేకపోయినా, సభలో ఎవరికీ ఇష్టాన్ని కలిగించని మాటలు మాట్లాడినా, అవన్నీ నిరర్థకములే. పస లేని సారములేని చప్పని ఫలితాన్నిచ్చేవి. In Telugu Sumathi Satakalu

సుమతీ శతకము-29

Posted: 03/01/2012 06:05 PM IST
Sumati satakam

 

sumati

 

శుభముల నొందని చదువును

నభినయమును రాగరసము నందని పాటల్

అభిలాష లేని కూటమి

సభ మెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ

 

శుభములనొందని- మంచి చెయ్యని, చదువును- చదువు, అభినయమును- భావ ప్రకటన, రాగ- సరైన రాగములోను, రసము- సరైన భావములోను, అందని- పలికించని, పాటల్- పాటలు, అభిలాష లేని- ఆసక్తి కలిగించని, కూటమి- కలయిక, సభమెచ్చని- సభలో ఎవరికీ నచ్చని, మాటలెల్ల- మాటలు ఇవన్నీ, చప్పన- సారం లేక చప్పగా ఉంటాయి.

చదివే చదువు వలన ఉపయోగం లేకపోయినా, రాగయుక్తంగా భావాన్ని పలికిస్తూ పాట పాడకపోయినా, కలిసిన బృందం ఆసక్తికరంగా లేకపోయినా, సభలో ఎవరికీ ఇష్టాన్ని కలిగించని మాటలు మాట్లాడినా, అవన్నీ నిరర్థకములే. పస లేని సారములేని చప్పని ఫలితాన్నిచ్చేవి.

ఆధునిక యుగంలో పర్సనాలిటీ డెవలప్ మెంట్ అనే పేరుతో తయారు చేసిన కోర్సంతా పూర్వకాలం చెప్పిన నీతివాక్యాలలోని చిన్న భాగమే. ఏ పని చేసినా దానికో పరమార్థముండాలి. ఒక లక్ష్యముండాలి. మనం చేసే పని ఆశించిన ఫలితం దక్కే విధంగా కృషి చెయ్యాలి. అంటారు శతకకర్త. ఒక చదువు, శిక్షణ పొందినా దాని ఫలితం ఎలావుంటుందో ముందుగా తెలుసుకుని వాటిని చేపట్టకపోతే సమయనష్టం జరుగుతుంది. అలా నిర్దిష్టమైన లక్ష్యం లేకపోతే చివరకు నిస్సారంగా తయారవుతుంది. దాన్ని రాగయుక్తంగా భావప్రకటనతో చేసే గానంతోనూ జీవంలేని సాన్నిహిత్యం (కంపెనీ) తోనూ, సభలో ఏదో అర్థం లేకుండా, ఎవరూ ఇష్టపడని మాటలతోనూ పోల్చి చెప్పారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sumati satakam
Sumati satakam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more