Sumathi Satakam in Telugu 31942 Sumathi Satakalu

Sumati satakam

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu నయమున బాలును ద్రావరు

Get the Sumathi Satakam ఈ సూక్తిని నేర విచారణల్లో బాగా వాడుతారు. మనదేశంలో మరీ. నేరారోపణలో అరెస్టైన వారి మీద ధర్డ్ డిగ్రీ ప్రయోగంతో మొదలుపెట్టి పోలీసులు కేసులను అతివేగంగా పరిష్కరిస్తారు. In Telugu Sumathi Satakalu

సుమతీ శతకం-26

Posted: 02/22/2012 12:42 PM IST
Sumati satakam

sumati

నయమున బాలును ద్రావరు

భయమున విషమైనగాని భక్షింతురుగా

నయమెంత దోసకారియొ

భయమే చూపంగవలయు బాగుగ సుమతీ

నయమున- అనునయంగా మంచి మాటలతో, పాలును త్రావరు- పాలు కూడ తాగరు, భయమున- భయపెట్టినట్లయితే, విషమైనగాని- విషపదార్థమైనా, భక్షింతురుగా- తినేస్తారు కదా, నయమెంత- మంచితనం ఎంత, దోసకారియో- చెడ్డదో, భయమే చూపంగవలయు- అందువలన భయాన్నే చూపించాలి, బాగుగ- బాగా.

మంచిగా చెప్తే పాలైనా తాగరు కానీ భయపెడితే విషాన్నైనా గటగటా తాగేస్తారు. అందువలన మంచితనం పనికిరాదు, బాగా భయపెట్టాల్సిందే.

ఇదేదో విప్లవాత్మకమైన మాటలు అనుకోగూడదు. ఈ ఒక్క పద్యాన్నే విడిగా చూసి సుమతీ శతకంలో మంచి పనికి రాదని చెప్పారని అనగూడదు. సమాజంలో మెలిగేవారందరూ మంచితనంతో మెలగాల్సిందే కానీ ఒక వ్యవహారంలో ఉన్నప్పుడు ఎంత కరుకుదనం చూపించాలో అంతా చూపించాలి. అదే వ్యవహార దక్షత.

ఈ సూక్తిని నేర విచారణల్లో బాగా వాడుతారు. మనదేశంలో మరీ. నేరారోపణలో అరెస్టైన వారి మీద ధర్డ్ డిగ్రీ ప్రయోగంతో మొదలుపెట్టి పోలీసులు కేసులను అతివేగంగా పరిష్కరిస్తారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sumati satakam
Sumati satakam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more