Sumathi Satakam in Telugu 31736 Sumathi Satakalu

Sumati satakam

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu ధనపతి సఖుడైయుండియు

Get the Sumathi Satakam కుబేరుడు శివుడి చెలికాడే అయినా శివుడు భిక్షాటన చేయవలసివచ్చినట్టుగా, తన భాగ్యమెంతుందో అదే ఎవరికైనా తన అనుభవానికి వస్తుంది కానీ తనవాళ్ళకి ఉన్న సంపదలు వాళ్ళవే కానీ తనవి కావు. In Telugu Sumathi Satakalu

సుమతీ శతకం-24

Posted: 02/15/2012 06:25 PM IST
Sumati satakam

sumati

ధనపతి సఖుడైయుండియు

నెనయంగా శివుడు భిక్ష మెత్తంగ వలసెన్

దనవారి కెంత గలిగిన

దన భాగ్యమె తనకుగాక తథ్యము సుమతీ

ధనపతి= కుబేరుడు, సఖుడైయుండియు= స్నేహితుడైనా కూడా, ఎనయంగా= సంభవించినట్లు శివుడు భిక్షమెత్తగ వలసెన్= భిక్షమెత్తుకోవలసి వచ్చింది, తనవారికెంత కలిగిన= తనవాళ్ళకి ఎంత సంపదున్నా, తన భాగ్యమె తనకుగాక= తనకున్నదే తన అనుభవానికి వస్తుంది, తథ్యము= సత్యము

కుబేరుడు శివుడి చెలికాడే అయినా శివుడు భిక్షాటన చేయవలసివచ్చినట్టుగా, తన భాగ్యమెంతుందో అదే ఎవరికైనా తన అనుభవానికి వస్తుంది కానీ తనవాళ్ళకి ఉన్న సంపదలు వాళ్ళవే కానీ తనవి కావు.

ప్రపంచంలో చాలామందికి ధనవంతులను చూస్తే వారితో చెలిమి చేయాలని, వారికి దగ్గరవాలని ఆశిస్తూ వారికి ఎనలేని గౌరవమివ్వటం కూడా జరుగుతుంది. కానీ వాళ్ళకున్న సంపదలు వాళ్ళవే కానీ నీకందులో వాటా ఏమీ ఉండదని తెలుసుకోమని అంటున్నారు శతకకర్త. ఈ మాట, జోగి జోగి రాసుకుంటే రాలేది బూడిదే అన్న నానుడికి వ్యతిరేకం. సాధువులు ఒంటినిండా బూడిద పూసుకుంటారు. అలాంటి ఇద్దరు సాధువులు పూసుకుని తిరిగితే రాలేదేమిటి బూడిదే కదా అనటంలో అర్థమేమిటంటే, కాస్త డబ్బులున్నవాడితో తిరిగితే ఏమైనా రాలుతుందేమో, నీకేమైనా ఉపయోగిస్తుందేమో అని. కానీ సుమతీ శతకంలో దాన్ని ఖండిస్తున్నారు. ధనవంతుడితో పూసుకుని తిరిగినా సరే ఎవరి భాగ్యంలో ఏముందో అదే కానీ ఇతరులది మీదెప్పుడూ కాదని, అందువలన అటువంటి సమయవ్యర్థం చేసే పనులు చేసేకంటే మీరూ కష్టపడి సంపాదించుకునే ప్రయత్నం చెయ్యండి కానీ ఉన్నవాళ్ళ దగ్గర చేరితే మీకేదో వస్తుందని ఎప్పుడూ అనుకోకండి అని సలహా ఇస్తున్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sumati satakam
Sumati satakam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more