Sumathi Satakam in Telugu 31588 Sumathi Satakalu

Sumati satakam

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu తన కోపమె తన శత్రువు

Get the Sumathi Satakam తన కోపమే తన శత్రువు అన్నదానికి "బయట శత్రువులే కాదు, మనిషి లోపల కూడా ఏ శత్రువూ హాని చెయ్యలేని విధంగా నష్టం జరుగుతుంది" అన అర్థమొస్తుంది. కోపావేశాలను తగ్గించుకుంటే వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి. In Telugu Sumathi Satakalu

సమతీ శతకం-22

Posted: 02/11/2012 04:51 PM IST
Sumati satakam

sumati

తన కోపమె తన శత్రువు

తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ

తన సంతోషమె స్వర్గము

తన దుఖమె నరకమండ్రు తథ్యము సుమతీ

దీనికి ప్రతిపదార్థం ఇవ్వనక్కరలేదు. బహుళ ప్రచారంలో ఉన్నది, ఎవరికైనా ఇట్టే అర్థమయ్యే పద్యమిది.  మనిషి తన శత్రువుకి భయపడతాడు లేదా జాగ్రత్త వహిస్తాడు. మొత్తానికి కొంత సమయాన్ని, శక్తిని వినియోగిస్తాడు. దానికి తోడు ఆందోళనకు కూడా గురౌతాడు. కానీ ఆ శత్రువు ఎక్కడినుండో పుట్టుకురాలేదు. మన స్వభావాన్నిబట్టే మనకు శత్రువులు, మిత్రులు తయారవుతారు. అందుకే "నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది" అనే సామెత కూడా వచ్చింది.

తన కోపమే తన శత్రువు అన్నదానికి "బయట శత్రువులే కాదు, మనిషి లోపల కూడా ఏ శత్రువూ హాని చెయ్యలేని విధంగా నష్టం జరుగుతుంది" అన అర్థమొస్తుంది.  కోపావేశాలను తగ్గించుకుంటే వ్యాధులు కూడా దూరంగా ఉంటాయి. శాంత స్వభావం వలన అంతర్గత శత్రవులనుండి రక్షించబడతాడు. అందుకే తన శాంతమె తనకు రక్ష అన్నారు శతక కర్త. మనం చూపించిన దయ తప్పకుండా మనకు చుట్టాలను తయారుచేస్తుంది. అభిమానులు తయారవుతారు. వారు చూపించే కృతఙత ఎప్పుడో ఒకపుడు మన ఆపద్సమయంలో మనకి పనికి వస్తుంది.

మరో గొప్ప విషయాన్ని కూడా ఈ పద్యం మనకు తెలియజేస్తుంది- స్వర్గం నరకం ఎక్కడో లేవని. మనమెక్కడున్నా సంతోషంగా ఉంటే అదే స్వర్గం. ఎన్ని సౌఖ్యాలను కలిగివున్నా దుఖ్ఖంలో ఉంటే అది నరకమే అవుతుంది. అందువలన, శత్రువులూ మిత్రులే కాదు, స్వర్గాన్ని నరకాన్ని కూడా మనమే తయారు చేసుకుంటాం. మన చుట్టూ మనం కలుగజేసుకునే మానవ సంబంధాలన్నీ మన స్వభావం వలన మనకు చేకూరినవే.

అంటే, మన మనోభావాలను నియంత్రించుకునే స్వభావం మన సంబంధ బాంధవ్యాల మీద, శరీరారోగ్యం మీదా తన ప్రభావం చూపుతుంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sumati satakam
Sumati satakam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more