కప్పకు నొరగాలైనను
సప్పమునకు రోగమైన, సతి తులువైనన్
ముప్పున దరిద్రుండైనను
తప్పదు మరి దుఖమగుట తథ్యము సుమతీ
కప్పకు నొరగాలైన- కప్ప కుంటిదైనట్లయితే, సప్పమునకు రోగమైన- పాముకి రోగమొచ్చినట్లయితే, సతి తులువైనన్- భార్య దుర్మార్గంగా ప్రవర్తించేదైతే, ముప్పున- ముసలితనంలో, దరిద్రుండైన- డబ్బు లేక దారద్ర్యంలో ఉన్నట్లయితే, తప్పదు మరి- తప్పనిసరిగా, దుఖమగుట తథ్యము- దుఖ్ఖం పాలవక తప్పదు.
కప్ప కుంటిదైనా, పాముకు రోగమొచ్చినా, భార్య దుష్ట ప్రవర్తన కలిగివున్నా, ముసలితనంలో దారిద్ర్యం సంభవించినా దుఖ్ఖానికి హేతువులవుతాయి.
ఈ పద్యాల్లో మాటల సొంపు, పద్యాల నిబంధనలైన ప్రాసలు చక్కగా కలవటం చేత రిథమిక్ గా చదవటానికి వీలవుతాయి. అందుకే గుర్తు పెట్టుకోవటం కూడా సులభమయ్యేది. కప్ప ఎగురుతూ దుముకుతూ పోయే ప్రాణి. దాని కాలు విరిగి కుంటిదేతే దాని పరిస్థితి ఎలా ఉంటుంది? అలాగే జరజరా పాక్కుంటూ పోయే పాముకి జబ్బు చేసి కదలలేని స్థితిలో ఉంటే దాని మనుగడ ఎలా ఉంటుంది? ప్రేమగా చూసుకుందామనుకున్న భార్య దుష్ట ప్రవర్తన కలిగివున్నదైతే ఆ దాంపత్యం ఎలా ఉంటుంది? కాళ్ళూ చేతులూ బాగుండి శరీరంలో శక్తి కలిగున్నప్పుడే మనిషి ఏమైనా పని చేసుకుని సంపాదించుకోగలుగుతాడు. దారిద్ర్యం నుంచి తప్పించుకోగలుగుతాడు. అదే మనిషికి వృద్ధాప్యంలో గనక దారిద్ర్యం సంభవిస్తే ఆ మనిషి ఏం చెయ్యగలడు? పైన చెప్పిన పరిస్థితులన్నీ దుఖ్ఖ హేతువులే. వారికి దుఖ్ఖం తప్ప మరొకటి లేదు అని అనటంలో శతక కర్త వారిని జీవితాంతం అనుభవిస్తూ ఉండిపోమని కాదు చెప్తున్నది!
కప్ప పాముల ఉదాహరణలతో పోలుస్తూ, మనుషుల విషయంలో అర్ధాంగిని ఎన్నుకునేటప్పుడే జాగ్రత్త వహించాలి, ఆమె గుణగణాలను తెలుసుకోవాలి. లేక పోతే ఆ తర్వాత జీవితాంతం దుఖ్ఖం తప్ప మరేమీ ఉండదని చెప్తున్నారు. అలాగే, వయసులో ఉన్నప్పుడే సంపాదించిన సొమ్మును వృద్ధాప్యం కోసం దాచుకోవాలి. ఎల్లకాలం ఇలాగే సాగిపోతుందిలే అనుకుని ఎప్పటికప్పుడు ఖర్చు పెడుతూ పోతుంటే కష్టపడి సంపాదించే కాలం ముగిసిన తర్వాత సంపాదించలేక, ఎవరినీ అడగలేక ఇక్కట్ల పాలవుతారు సుమా అని హెచ్చరిస్తున్నారు. రకరకాల పెన్షన్ ప్లాన్లు అందుకే వచ్చాయి. వాలంటరీ రిటైర్ మెంటులో ఒకేసారి వచ్చే ధనానికి ఆశపడి, అది కాస్తా అందరూ పంచుకుని చివరకు వృద్ధాప్యంలో అతని దగ్గర ఏమీ లేకుండా చేసి దుఖ్ఖానికి గురిచేసిన ఉదంతాలు ఎన్నో వెలుగుచూసాయి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more
Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more
Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్ మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more
Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more
Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్ సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more