టెలీ కమ్యూనికేషన్స్ రంగంలో ఇప్పటికే సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో ఇక సాంకేతిక రంగంలోనూ ప్రకంపనలు సృష్టించేందుకు సిద్దమైంది. తాజాగా ఐటీ సహా ఇతర రంగాలకు చెందిన నిపుణులకు రిలయన్స్ జియో తీపి కబురందించింది. తన తొలి లో-బడ్జెట్ లాప్‌టాప్‌ను ఆవిష్కరించింది. కేవలం 20 వేల రూపాయల లోపు బడ్జెట్ ధరలో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని జియో వర్గాలు చెబుతున్నాయి. అయితే సంస్థ వర్గాలు మాత్రం ఇప్పటికీ దీని ధరను అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. సాధారణ ప్రజలకు దీపావళి తర్వాత అందుబాటులోకి రానున్నదని తెలుస్తోంది.
ప్రస్తుతానికి ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ (జీఈఎం - GeM) పోర్టల్‌లో అందుబాటులో ఉంది. అయితే కేవలం కేంద్ర ప్రభుత్వోద్యోగులకు విక్రయించడానికి మాత్రమే `జీఈఎం (GeM)`లో అందుబాటులో ఉంచారని సమాచారం. `జియో బుక్` పేరుతో అందుబాటులోకి రానున్న లాప్టాప్ ధర రూ.19,500గా ఈ వెబ్ సైట్ పేర్కోనడం గమనార్హం. 2జీబీ రామ్ కెపాసిటీతో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ)లో జియో బుక్ డిస్ప్లే చేశారు. జియో బుక్ లాప్టాప్ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం 32 జీబీ. 6-8 గంటల బ్యాటరీ బ్యాకప్ సౌకర్యం కల్పిస్తోంది.
11.6 అంగుళాల హెచ్డీ ఎల్ఈడీ బ్యాక్లిట్ యాంటీ గ్లేర్ స్క్రీన్‌తో అందుబాటులోకి వస్తున్నది. ఏడాది పాటు బ్రాండ్ వారంటీ అందిస్తున్నది. యూఎస్బీ 2.0 పోర్ట్, యూఎస్మా 3.0 పోర్ట్, హెచ్డీఎంఐ పోర్ట్, మైక్రో ఎస్డీ స్లాట్ కూడా లభిస్తుంది. జియోబుక్ లాప్టాప్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 665 ఒక్టాకోర్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. జియో ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగానే జియో బుక్ పని చేస్తుంది. 802.11 ఏసీ వై-ఫై కనెక్టివిటీ ఫెసిలిటీ ఉంది. బ్లూటూత్ వర్షన్ 5.2తో బ్లూటూత్ కనెక్టివిటీ, 4జీ మొబైల్ బ్రాడ్‌బాండ్ కనెక్టివిటీ ఉంటుంది. ఇంటర్నల్ స్పీకర్లు, డ్యుయల్ మైక్రో ఫోన్లు కూడా ఉంటాయి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more