దేశరాజధాని ఢిల్లీలో మరో దారుణఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కేంద్రీయ విద్యాలయంలో చదువుతున్న మైనర్ బాలికపై అదే పాఠశాలకు చెందిన ఇద్దరు సీనియర్ విద్యార్థులు పాఠశాల వాష్ రూమ్ లోనే అమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. 11 ఏళ్ల బాలికపై 12వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జులైలో జరిగిన ఈ ఘటనపై తాజాగా ఢిల్లీ మహిళా కమీషన్ నోటీసులు జారీ చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కూడా కేసు నమోదు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేపుతోంది.
కాగా తనపై జరిగిన అఘాయిత్యంపై బాధిత బాలిక అదే రోజు తన క్లాసు టీచరుకు చెప్పినప్పటికీ దానిని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంతో పాటు విషయాన్ని బయట వ్యక్తులకు చెప్పకూడదని వారించింది. బాధిత విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు విద్యార్థులను పాఠశాల నుంచి బహిష్కరించామని.. విషయం బయటకు తెలిస్తే వారు కూడా వచ్చి అల్లరి చేస్తారని హెచ్చరించింది. దీంతో బాలికపై అత్యాచారం జిరిగిన విషయం ఇన్నాళ్లు మరుగున పడిపోయింది. తాజాగా, బాలిక తల్లిదండ్రులు మహిళా కమీషన్ ను ఆశ్రయించిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్రీయ విద్యాలయం యాజమాన్యానికి నోటీసులు జారీచేసింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. జూలై నెలలో బాలిక తన క్లాస్ రూములోకి వెళ్తుండగా పొరపాటున ఇద్దరు సీనియర్లను ఢీకొట్టింది. వెంటనే ఆ చిన్నారి వారికి క్షమాపణలు చెప్పింది. అయినప్పటికీ వినిపించుకోకుండా బలవంతంగా టాయిలెట్లోకి తీసుకెళ్లి గడియపెట్టి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఈ విషయాన్ని టీచర్ దృష్టికి తీసుకెళ్లగా, నిందితులైన ఇద్దరినీ స్కూలు నుంచి బహిష్కరించామని, ఈ విషయం గురించి బయట ఎక్కడా మాట్లాడొద్దని చెప్పింది. తాజాగా, ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్.. ప్రిన్సిపాల్‌తోపాటు పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలీవల్ మాట్లాడుతూ.. స్కూల్లోనూ అమ్మాయిలకు రక్షణ లేకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందులో స్కూలు అధికారుల పాత్రపైనా విచారణ జరగాలని అన్నారు. దీనిపై కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రాంతీయ కార్యాలయం స్పందించింది. జరగిన ఘటనపై విచారణకు ఆదేశించింది. అయితే, స్కూలు వర్గాల వాదన మరోలా ఉంది. తానీ విషయాన్ని టీచర్‌కు చెప్పానని బాధిత బాలిక చెబుతుండగా, బాలిక కానీ, ఆమె తల్లిదండ్రులు కానీ తమకు ఈ విషయంపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పేర్కొంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more