Leopard enters house while chasing dog in Satara విజయ ఏకాదశి రోజున వారింటికి పిలవకుండా వెళ్లిన అతిధి..

Leopard enters home in satara rescued by forest officials

leopard video viral, Leopard in house, leopard in Koyanagar, Leopard in Satara, Leopard in Maharashtra, Divisional forest officer Vishal Mali, Dussehra, Godess Durga, durga idol immersion, leopard, Satara, Koyanagar, Forest department, Maharashtra, Crime

A leopard believed to be about a year old was spotted running into a home in Koyanagar, Satara and later casually roaming inside the stay. The incident occurred on Thursday night, during the goddess Durga idol immersion.

ITEMVIDEOS: విజయ ఏకాదశి రోజున వారింటికి పిలవకుండా వెళ్లిన అతిధి..

Posted: 10/07/2022 03:58 PM IST
Leopard enters home in satara rescued by forest officials

దసరా.. విజయదశమి.. కనకదుర్గమ్మ శ్రీరాజరాజేశ్వర దేవీగా భక్తులకు దర్శనమిచ్చిన రోజు. అందరితో పాటు ఆ ఇంట్లోనివారు కూడా ఎంతో భక్తిశ్రద్దలతో అమ్మవారి దర్శనం చేసుకుని పండగను ఘనంగా జరుపుకున్నారు. ఆ మరుసటి రోజున గ్రామస్థులందరితో పాటు కలసి ఆ కుటుంబం మొత్తం అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి చెరువు గట్టు వద్దకు తరలివెళ్లి.. అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేసి వచ్చారు. ఇంతలో ఆ కుటుంబం నుంచి ఎలాంటి ఆహ్వానము లేకుండా వారింటికి అనుకోని అతిధి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇల్లంతా కలియ తిరిగారు.

ఈలోగా కుటుంబసభ్యులు అమ్మవారి నిమజ్జనం నుంచి తిరిగి వచ్చారు. అంతే అనుకోని అతిధిని చూసి హడలిపోయి.. వెంటనే ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు. ఇంటి గడియ పెట్టి ఏకంగా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇంతకీ ఏం జరిగిందీ.? ఎవరా అనుకోని అతిధి అంటారా.? ఏదో పాము, లేదా కొండచిలువ వచ్చిందని అనుకుంటున్నారా..? కాదండీ ఏకంగా చిరుత పులి వచ్చింది. మహారాష్ట్రలోని సతారాలో గ్రామంలో జరిగిందీ విచిత్ర ఘటన. సతారాలోని కోయానగర్‌లోని ఓ ఇంట్లోకి చిరుతపులి చొరబడింది. ఇంట్లోని గదుల్లో దర్జాగా తిరిగింది.

కోయానగర్‌కు చెందిన ఓ కుటుంబం గురువారం రాత్రి దుర్గా విగ్రహాల నిమజ్జనోత్సవంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లోకి ఓ చిరుతపులి చొరబడింది. నిమజ్జనం అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు.. ఓ గది తలపు వద్ద కూర్చొని ఉన్న పులిని చూసి షాక్‌ అయ్యారు. వెంటనే భయంతో బయటకు పరుగులు తీసిన కుటుంబ సభ్యులు.. తలుపులను మూసి గడియపెట్టారు. ఇంట్లోకి చిరుతపులి వచ్చిందన్న సమాచారంతో చుట్టుపక్కలవారు పెద్దఎత్తున అక్కడ గుమిగూడారు. కిటికీల్లోనుంచి చిరుతపులిని వీడియోలు తీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. పులిని బోనులో బంధించి తీసుకెళ్లారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dussehra  Godess Durga  durga idol immersion  leopard  Satara  Koyanagar  Forest department  Maharashtra  Crime  

Other Articles