Doctor donates all her properties for social cause వైద్యురాలు ధాతృత్వం..జీజీహెచ్ కు యావదాస్తి దానం..!!

Dr uma gavini donates all her properties to guntur ggh mccu ward

Uma Gavini, Dr.Uma Gavini, US Doctor, US Doctor Uma Gavini, immunology and allergy medicine Specialist Dr. Uma Gavini, US Doctor Uma Gavini Donations, US Doctor Uma Gavini savings, US Doctor Uma Gavini properties, US Doctor Uma Gavini bank balance, US Doctor Uma Gavini MCCU, Mother and Child Care Unit (MCCU), Government Medical College (GMC), Guntur General Hospital, Andhra Pradesh

A doctor named Uma Gavini, who has been living in the US, is in the news for donating all her savings, properties and bank balance towards the construction of a Mother and Child Care Unit (MCCU) in Government Medical College (GMC) in Guntur. As per news reports, she has donated property worth Rs 20 Cr towards social purpose. The doctor has made a name for herself as a specialist in immunology and allergy medicines.

ప్రభుత్వాసుపత్రికి యావదాస్తి దానం.. వైద్యురాలు ధాతృత్వం..!!

Posted: 10/06/2022 04:51 PM IST
Dr uma gavini donates all her properties to guntur ggh mccu ward

దేశం కాని దేశంలో తన ప్రతిభను చాటుకుని వైద్యురాలిగా స్థిరపడి.. అక్కడివారికి సేవలందించిన ఓ వైద్యురాలు.. తాను ఇన్నాళ్లు కష్టించి ఆర్జించిన మొత్తాన్ని తన స్వస్థలంలోని ఓ జిల్లా ప్రభుత్వ అసుపత్రికి తన యావదాస్తిని దానం చేయడం చర్చనీయాంశంగా మారింది. అగ్రరాజ్యం అమెరికాలో యాభైఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన తన యావదాస్తినీ అమె తృణప్రాయంగా దానం చేసేశారు. అంతేకాదు.. అమె దాతృత్వం అమెరికాలో స్థిరపడిన ఇతర తెలుగువారిని కూడా కదిలించింది. ఎంతో ఇచ్చిన ప్రాంతానికి.. తిరిగి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలని ప్రేరణ కల్పించింది.

తన భర్త మూడేళ్ల కిందట మృతి చెందటం, ఆస్తులు అనుభవించేందుకు అమెకు వారసులు లేకపోవడంతో డాక్టర్‌ ఉమ గవిని తన ఆస్తినంతా ఉదారంగా దానం చేశారు. తన స్వస్థలమైన గుంటూరు జిల్లాలోని ప్రభుత్వ జనరల్ అసుపత్రి (జీజీహెచ్‌)కు ఇచ్చేశారు. అస్తులనే కాదు తన చేతిలో చిల్లి గవ్వ కూడా మిగుల్చుకోకుండా.. చివరికి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా ఆమె దానం చేశారు. మొత్తం రూ.20 కోట్ల (2.50 లక్షల డాలర్లు) ఆస్తిని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి విరాళంగా ప్రకటించారు. అయితే ఆ భవనానికి అమె పేరును పెట్టేందుకు కూడా అమె సున్నితంగా తిరస్కరించారు.

గుంటూరు జిల్లాకు చెందిన ఉమా ప్రస్తుతం అమెరికాలో ఇమ్యునాలజిస్ట్‌, ఎలర్జీ స్పెషలి్‌స్టగా పనిచేస్తున్నారు. ఆమె గుంటూరు వైద్య కళాశాలలో 1965లో మెడిసిన్‌ చేశారు. ఉన్నత విద్య పూర్తి చేసి నాలుగు దశాబ్దాల కిందట అమెరికా వెళ్లి.. స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా అక్కడే స్ధిరపడ్డారు. గత నెలలో డల్లాస్‌లో జరిగిన గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం, ఉత్తర అమెరికా (జింకానా) 17వ రీ యూనియన్‌ సమావేశాల్లో ఉమా పాల్గొన్నారు. తాను మెడిసిన్‌ చేసిన జీజీహెచ్‌కు భారీ విరాళం ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఆమె అక్కడి వేదిక మీదే ప్రకటించారు.

ఆస్తిలో 80 శాతం, 90 శాతం దానంచేసే పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు అమెరికాలో కనిపిస్తారు. అలాచూస్తే... ఉమా ఔదార్యం వారిని కూడా మించిపోయింది. చేతిలో డాలర్‌ కూడా దాచుకోకుండా తన తరపున, తన భర్త తరపున వచ్చిన ఆస్థి మొత్తాన్ని ఇచ్చేశారు. కాగా, ఉమా 2008లో ‘జింకానా’ అధ్యక్షురాలిగా సేవలందించారు. ఆమె అందించిన విరాళంతో నిర్మాణం అవుతున్న జీజీహెచ్‌లోని ఎంసీహెచ్‌ బ్లాక్‌కు ఆమె పేరును పెడతామని జింకానా సభ్యులు సూచించగా అమె తిరస్కరించారు. చివరికి డాక్టర్‌ ఉమా భర్త.. డాక్టర్‌ కానూరి రామచంద్రరావు పేరును ఈ బ్లాక్‌ను పెట్టాలని నిర్ణయించారు.

అమె భర్త డాక్టర్‌ కానూరి రామచంద్రరావు కర్ణాటకలోని గుల్బర్గాలో మెడిసిన్‌ చేసి, ఎనస్థటి్‌స్టగా సేవలు అందించారు. మూడేళ్ల కిందట ఆయన మృతి చెందారు. జింకానా రీ యూనియన్‌ సమావేశాల్లో డాక్టర్‌ ఉమా గవి స్ఫూర్తితో ఇతర వైద్యులు సైతం ముందుకు వచ్చారు. డాక్టర్‌ మొవ్వా వెంకటేశ్వర్లు తన వంతుగా రూ.20 కోట్లు (2.50 లక్షల డాలర్లు), డాక్టర్‌ సూరపనేని కృష్ణప్రసాద్‌, షీలా దంపతులు రూ.8 కోట్లు (మిలియన్‌ డాలర్లు), తేళ్ల నళిని, వెంకట్‌ దంపతులు రూ.8 కోట్లు (మిలియన్‌ డాలర్లు) ఇచ్చేందుకు అంగీకరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles