Virginia man wins $1 million using his birthday numbers పుట్టిన తేదీ, ఏడాది.. ఇన్నాళ్లకు కలిసోచ్చి.. రాత్రికి రాత్రే..

Lucky virginia man buys 200 lottery tickets wins 1 million using his birthday numbers

Virginia Lottery, Huge Prize Money, Alexanderia Man, United States, Ali Ghaemi, Birth Year, Birth Month, lottery, alexandria, virginia lottery winner, missouri lottery, virginia, missouri, lucky ali ghaemi, probability, Virginia Lottery game, United States of America

Ali Ghaemi won’t soon forget the number combination he used to win $1 million in a single lottery drawing, partially due to the fact that it is his birthday. Ghaemi was getting ready to leave town when he decided to splurge on tickets for the Pick 4 Virginia Lottery game for the Sept. 6 drawing. He headed over to the Safeway located at 1688 Anderson Road in McLean, where he decided to buy 200 tickets to the game.

పుట్టిన తేదీ, ఏడాది.. ఇన్నాళ్లకు కలిసోచ్చి.. రాత్రికి రాత్రే..

Posted: 10/06/2022 05:58 PM IST
Lucky virginia man buys 200 lottery tickets wins 1 million using his birthday numbers

అదృష్టం ఉంటే సరైన సమయంలో తప్పక దరిచేరుతుందని ఇప్పటికే పలు ఘటనలు రుజువు చేశాయి. పోలం పనులకు వెళ్తే వజ్రాలు లభించడం, లాటరీలు కొంటే.. ఫస్టు ప్రైజులు తగలడం వంటి ఘటనలు అనేకం చూశాం. అయితే తాజగా ఓ అమెరీకన్ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వెళ్లాడు. ఏదో లక్కీ నెంబరు టికెట్ ను కొనుగోలు చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కంటే తాను పుట్టిన తేదీపైనే తన నమ్మకంతో అలా చేయాలని అనుకున్నాడు. అంతే అనుకోకుండా అదృష్టం ఆయన తలుపుతట్టింది. తన పుట్టినతేదీ, సంవత్సరం కలిపిన నంబర్ తో లాటరీ టికెట్లు కొన్న వ్యక్తికి బంపర్ బహుమతి కలిసి వచ్చింది.

అయితే ఏదో ఒక టికెట్ కొనకుండా.. ఏకంగా 200 టికెట్లు కొన్నాడు. ఒక్కో టికెట్ కు ఒక్కో డాలర్ చొప్పున 200 డాలర్లు పెట్టి టికెట్లు కొంటే.. ఏకంగా 10 లక్షల డాలర్లు (మన కరెన్సీలో రూ. 8 కోట్లకుపైనే) బహుమతి రావడం గమనార్హం. అమెరికాలో అలెగ్జాండ్రియా ప్రాంతానికి చెందిన ఆయన పేరు అలీ. తాను అన్నీ 0-2-6-5 నంబర్ సిరీస్ ఉన్న లాటరీ టికెట్లు కొని జాక్ పాట్ కొట్టాడు. ఈ రెండు వందల టికెట్లకు ఒక్కోదానికి 5వేల డాలర్ల చొప్పున బహుమతి తగిలింది. అంటే మొత్తం కలిపి 10 లక్షల డాలర్లు అన్నమాట. అమెరికాలో జరిగే లాటరీ టికెట్లలో సిరీస్ తరహా డ్రాలు తీస్తుంటారు.

ఉదాహరణకు కేవలం మూడు సంఖ్యల లాటరీ అనుకుంటే.. ఎన్ని వేలు, లక్షల లాటరీ టికెట్లు అమ్మినా కూడా.. వాటిలో.. సదరు డ్రాలో తీసిన చివరి మూడు సంఖ్యలు ఉన్న టికెట్లు అన్నీ కూడా బహుమతికి ఎంపిక అవుతాయన్నమాట. అలీ తాను కొన్న మొత్తం 200 టికెట్లు కూడా చివరన ఒకే నంబర్ వచ్చేలా తీసుకున్నాడు. ఈ క్రమంలోనే అలీకి కొన్న మొత్తం టికెట్లకు బహుమతి తగలడం గమనార్హం. అయితే లాటరీ తగలడం అనేది అత్యంత అరుదైన విషయం. లక్షల మంది లాటరీ టికెట్లు కొంటుంటే.. అందులో ఏ ముగ్గురు, నలుగురికో అదృష్టం కలిసి వస్తుంది. అందులో ఈ వర్జీనియాకు చెందిన వ్యక్తికి అదృష్టం తలుపుతట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles