ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారని తెలుసు. తన సంస్థకు చెందిన అప్ కమ్మింగ్ విశేషాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను కూడా ఆయన తన ఫాలోవర్స్ తో పంచుకుంటారు. ఆయన తన ఖాతాలో వేసే ప్రతీ పోస్టు.. క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. పకృతి ఓడిలో అందమైన సరోవరం మొదలుకుని ఆంతకుముందు.. ఆ తరువాత అన్నీ ఎంతో క్రియేటివిటీతో కూడుకుని,. అశ్చర్యం గోలుపడంతో పాటు ఆసక్తిని కూడా రేకెత్తిస్తుంటాయి. ఈ క్రమంలో ఆయన తాజాగా చేసిన పోస్టు తన ఫాలోవర్స్ ను భక్తిపారవశ్యంలో ముంచింది.
తాజాగా ఆనంద్ మహీంద్రా దుబాయ్ లోని హిందూ ఆలయానికి సంబంధించిన వీడియోను తన ఫాలోవర్స్ తో పంచుకున్నారు. ఈ ఆలయానికి సంబంధించిన వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దుబాయ్లో ఆధ్యాత్మిక నిలయమైన జీబెల్ అలీ గ్రామంలో హిందువుల ఆలయాన్ని విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రారంభించారు. ఈ గ్రామంలో ఏడు చర్చిలు, ఒక గురుద్వారా ఉండగా.. తాజాగా హిందూ ఆలయం కూడా భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ఆలయం ప్రారంభం సందర్భంగా భక్తుల కరతాల ధ్వనులు, డప్పు చప్పులతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.
ఈ కార్యక్రమంలో దుబాయ్ మంత్రి షేక్ నయాన్ బిన్ ముబారక్, యూఏఈలోని భారత రాయబారి సంజయ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అరబిక్ నిర్మాణ శైలులను మేళవించి ఈ ఆలయాన్ని నిర్మించారు. శివుడు పార్వతుల నుంచి విష్ణుమూర్తి, బ్రహ్మ, కృష్ణుడు, ఇతర దేవతామూర్తుల అవతారాలను ఈ ఆలయంలో ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. ఈ వీడియోను పోస్టు చేస్తూ ఆనంద్ మహీంద్రా ‘అత్యద్భుతం’ అని క్యాప్షన్ పెట్టారు. తాను త్వరలో దుబాయ్ వెళ్లనున్నానని, ఆ సమయంలో తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్భిస్తానని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో పూజారులు ‘ఓం శాంతి శాంతి ఓం’ అని మంత్రాలు చదువుతుండగా.. భారతీయ తబలా, ఇతర వాయిద్యాలు మోగుతూ అలరిస్తున్నాయి.
I believe this magnificent Temple was formally inaugurated today. Auspicious timing. Will make sure to visit it on my next trip to Dubai… pic.twitter.com/F5IewLo1ns
— anand mahindra (@anandmahindra) October 5, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more