Goddess blesses devotees in Sri Lalitha Tripura Sundari Devi avatar ఇంద్రకీలాద్రిపై లలితా త్రిపుర సుందరీ దేవిగా కనకదుర్గమ్మ..

Goddess blesses devotees in sri lalitha tripura sundari devi avatar on day 5 of dasara festivities

Dussehra Navaratri celebrations, Indrakeeladri, Godess Kanaka Durgamma Devi as Sri Lalitha Tripura Sundari Devi, Sri Annapurna Devi, Sri Gayatri Devi, fourth Day of Durga Sarannavaratrulu, Sri Annapurna Devi, Sri Annapurna Devi history, Navaratri 4th day Sri Annapurna Devi, Sri Gayatri Devi, Sri Bala Tripura Sundari Devi, Sri Chakra, Sri Yantra pooja, Tirpura Traya, Kanaka Durga Devi Ammavaru, Sri Swarna kavachalankrutha Durga Devi, Vijayawada, Andhra Pradesh

Hill atop shrine Indrakeeladri diety Kanakadurgamma is blessing the devotees in Sri Lalitha Tripura Sundari Devi Avatar on the Fourth day of the nine-day Dussehra Navaratri celebrations. Kanaka Durgamma Devi Sharannavaratrulu whic began 26th Sepetember, will end on October 5 at the Indrakeeladri Ammavari Temple in Vijayawada.

దేవీ శరన్నవరాత్రులు 5వ రోజు: లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో కనకదుర్గమ్మ..

Posted: 09/30/2022 12:01 PM IST
Goddess blesses devotees in sri lalitha tripura sundari devi avatar on day 5 of dasara festivities

విజయవాడలోని ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేవిశరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదవరోజు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు అర్చకులు. ఈ తొమ్మిది రోజలు పాటు అమ్మవారు ప్రతిరోజు ఒక్కో అవతారంలో భక్తలకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. దేవి శరన్నవరాత్రులు అక్టోబర్‌ ఐదో తేదీ వరకు కొనసాగుతాయి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ కూడా అన్ని ఏర్పాట్లు చేసింది.

తొలిరోజు దుర్గమ్మ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా కనకదుర్గమ్మ దేవీ భక్తులను అనుగ్రహించగా, రెండవ రోజూన బాలత్రిపుర సుందరి అవతారంలో, మూడవ రోజున గాయత్రీ దేవిగా.. నాల్గవ రోజున శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనవిచ్చిన కనకదుర్గమ్మతల్లి.. ఐదవ రోజున లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. శరన్నవరాత్రులలో ఐదవ రోజు అమ్మ లలితా త్రిపుర సుందరీదేవిగా అనుగ్రహిస్తున్న తరుణంలో అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో ఆలయం వద్ద క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.

త్రిపురాత్రయంలో లలితా త్రిపుర సుందరీదేవి రెండో దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో, సకల లోకాతీత కోమలత్వంతో ప్రకాశిస్తుంది. ఈ తల్లి మణిద్వీప నివాసిని. సకల సృష్టి, స్థితి, సంహారకారిణి, శ్రీవిద్యా స్వరూపిణి. ఉపాసకులకు ముఖ్య ఆరాధ్యదేవత. ‘చిదగ్నికుండ సంభూతా’ అని లలితా సహస్రనామం చెబుతోంది. సకల విశ్వచైతన్య శక్తిస్వరూపం శ్రీచక్రం. ఈ శ్రీచక్రానికి అధిష్ఠాన దేవత లలితా త్రిపురసుందరి. కోటి సూర్యుల ప్రకాశంతో సమానమైన కాంతి స్వరూపంతో, చేతిలో పాశం, అంకుశం, చెరకు విల్లు, పూలబాణాలు ధరించి ఉంటుంది. ఈమెకు లక్ష్మీసరస్వతులు.. వింజామరలతో వీస్తూ సేవలు చేస్తుంటారు. లలితా త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే సకల ఐశ్వర్యప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles