Mumbai Lawyer Tries to Run Over Female Traffic Cop మహిళా పోలీస్‌ తనను టార్గెట్ చేసిందని.. ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా.?

Lawyer knocks down woman cop while fleeing with confiscated scooter

Mumbai lawyer, mumbai woman traffic police constable, Brajesh Behlloriya, lawyer, Scooter Towed, Mumbai Lawyer, Female Traffic Cop, Mumbai, Nalasopara, Traffic Cop, Video Viral, Angry Over Scooter Being Towed, Mumbai Lawyer Tries to Run Over Female Traffic Cop, Mumbai news, Mumbai city news, Mumbai, Maharashtra, Maharashtra government, India news

A Mumbai-based lawyer has been arrested for allegedly running over a woman traffic police constable while trying to flee on his scooter, which was towed away for parking in a restricted zone. Nalasopara police have also arrested the man’s wife, also a lawyer, for aiding him in the crime that took place around 1 pm on Monday and a video of which went viral

ITEMVIDEOS: మహిళా పోలీస్‌ తనను టార్గెట్ చేసిందని.. ఈ న్యాయవాది ఏం చేశాడో తెలుసా.?

Posted: 09/29/2022 07:38 PM IST
Lawyer knocks down woman cop while fleeing with confiscated scooter

నో పార్కింగ్‌ ప్రాంతంలో నిలిపిన స్కూటర్‌ను ట్రాఫిక్‌ పోలీసులు తీసుకెళ్లడంపై ఒక వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోలీసుల నుంచి బలవంతంగా స్కూటర్‌ను తీసుకెళ్లబోయాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్‌ మహిళా పోలీస్‌పైకి స్కూటర్‌ను దూకించాడు. దీంతో స్కూటర్‌ను పట్టుకుని రోడ్డుపై పడిన ఆమె గాయపడింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. సోమవారం మధ్యాహ్నం భార్యతో కలిసి స్కూటర్‌పై వెళ్లిన బ్రజేష్‌కుమార్ భల్లూరియా, నలసోపరా ప్రాంతంలోని పాటంకర్ పార్క్ వద్ద నో పార్కింగ్‌ ఏరియాలో దానిని నిలిపాడు.

దీంతో ట్రాఫిక్‌ పోలీసులు ఆ స్కూటర్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా, బ్రజేష్‌కుమార్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్కూటర్‌ను బలవంతంగా పోలీసుల నుంచి స్వాధీనం చేసుకున్నాడు. అక్కడి నుంచి వేగంగా వెళ్లేందుకు అతడు ప్రయత్నించాడు. అయితే గేట్‌ వద్ద ట్రాఫిక్‌ మహిళా పోలీస్‌.. న్యాయవాది స్కూటర్‌ను అడ్డుకోబోయింది. గేటు వేసేందుకు ప్రయత్నించింది. అయితే న్యాయవాది మాత్రం తన స్కూటర్ ను ఏ మాత్రం ఆపకుండా ముందుకు దూసుకెళ్లేందుకు ఎక్సలేటర్ ఇవ్వడంతో.. గేటుతో అడ్డుకోబోయిన మహిళా కానిస్టేబుల్ రోడ్డుపై పడింది. ఆమెకు స్వల్పంగా గాయాలయ్యాయి.

దీంతో న్యాయవాది బ్రజేష్ కుమార్ ను అక్కడున్న స్థానికులు అడ్డుకున్నారు. కొందరి అతనిపై చేయిచేసుకోబోయారు. అయితే తాను న్యాయవాదినని, ఈ మహిళా కానిస్టేబుల్ ప్రతీరోజు తనను అడ్డుకుంటోందని.. అమెకు సంబంధించిన వీడియోలు కూడా తన వద్దనున్నాయని బ్రిజేష్ కుమార్ పేర్కోన్నారు. ఇదిలాఉండగా, మహిళా కానిస్టేబుల్ పై స్కూటర్ తో ఢీకొనబోయారని అతనితోపాటు అతడి భార్యపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ దంపతులను అరెస్ట్‌ చేశారు. మరోవైపు ఆ మహిళా పోలీస్‌ గత కొన్ని నెలలుగా తనను టార్గెట్‌ చేస్తున్నదని న్యాయవాది అయిన బ్రజేష్‌కుమార్ ఆరోపించాడు. కాగా, ఒక వ్యక్తి తన మొబైల్‌ ఫోన్‌లో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles