Heavy rains likely across few districts of AP ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో అతిభారీ వర్ష సూచన..!

Coastal and rayalaseema districts of andhra pradesh likely to recieve heavy rainfall

Orange alert to coastal districts, Orange alert to rayalaseema districts, coastal district of Andhra pradesh, rayalaseema districts of andhra pradesh, India Meteorological Department (IMD), Orange alert to Nellore, Orange alert to prakasham, Orange alert to chitoor, Orange alert to kadapa, Orange alert to visakhapatnam, Orange alert to srikakulam, Orange alert to vizianagaram, Thunder stroms, Andhra Pradesh

In the wake of cyclonic circulation, Coastal and Rayalaseema parts of the State are likely to record heavy to severe Heavy rainfall. According to the IMD, districts like Nellore, Prakasham, chitoor, Kadapa, Ananthapur, Visakhapatnam, vizianagaram, Srikakulam, districts will see heavy rainfall.

ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు వరుణ గండం.. అతిభారీ వర్ష సూచన..!

Posted: 09/30/2022 01:04 PM IST
Coastal and rayalaseema districts of andhra pradesh likely to recieve heavy rainfall

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు వరుణ గండం తప్పినట్టు లేదు. ఇప్పటికే వర్షాకాలం ఆరంభం నుంచి సాధారణం కన్నా అధికంగా వర్షం కురిసి.. వాగులు, వంకలు, నదులు, కాలువలు పొంగిపోర్లుతూ.. రాష్ట్రంలోని రిజర్వాయలన్నీ నిండుకుండలా తలపిస్తున్నా.. వరుణుడుమాత్రం శాంతించడం లేదు. నైరుతి రుతుపవనాలు తిరోగమనం చెందినా.. తూర్పు మధ్య ప్రాంతంలో ఏర్పడే ఉపరితల అవర్తనాలతో అటు అరేబియన్ ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి రాష్ట్రంపై వరుణ ప్రతాపం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో మరోమారు రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పిడుగులాంటి వార్తను ప్రకటించింది.

మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని కోస్తా, రాయలసీయ జిల్లాల వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఆంధ్రప్రదే‌శ్‌లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కోస్తాను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి కోస్తా, రాయలసీమ మీదుగా కర్ణాటక వరకు మరో ద్రోణి విస్తరించినట్టు వాతావరణశాఖ పేర్కొంది. ఈ కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారాయని తెలిపింది. ఈ ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వివరించింది.

ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనుండగా, మిగిలిన జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు (శనివారం) దక్షిణ కోస్తాలో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాతావరణంలో అనిశ్చితి నెలకొని ఉందని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున చెట్లు, ఆరుబయట ప్రాంతాల్లో ఉండొద్దని అధికారులు తెలిపారు. కాగా, కోస్తా, రాయలసీమల్లో నిన్న కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles