IAS officer in tears after seeing injured child at hospital చిన్నారి గాయాలను చూసి చలించిపోయిన ఐఎఎస్ అధికారి

Ias officer roshan jacob in tears after seeing injured child at hospital

IAS Officer Roshan Jacob, Hospital, Lakhimpur Kheri, Roshan Jacob, accident victims, KGMU, Lucknow, Lakhimpur Kheri bus accident, IAS officer breaks down, IAS officer crying, Lucknow Divisional Commissioner, IAS officer, Roshan Jacob, Hospital, breaks down, Lakhimpur Kheri Accident, Roshan Jacob breaks down, Lakhimpur Kheri accident victims, KGMU, Lucknow, Lakhimpur Kheri bus accident, IAS officer breaks down, IAS officer crying, Lakhimpur Kheri, Lucknow, Madhya Pradesh, Crime

At least 10 people were killed and 41 injured after a bus collided with a truck in Uttar Pradesh’s Lakhimpur Kheri on Wednesday morning. Of the injured being treated at a trauma centre in the state capital Lucknow, one is a young boy whose condition moved IAS officer Roshan Jacob to tears.

ITEMVIDEOS: చిన్నారి గాయాలను చూసి చలించిపోయిన ఐఎఎస్ అధికారి

Posted: 09/29/2022 06:43 PM IST
Ias officer roshan jacob in tears after seeing injured child at hospital

రోడ్డుప్ర‌మాదంలో గాయ‌ప‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఓ చిన్నారిని చూసి ఐఏఎస్ ఆఫీస‌ర్ బోరున విల‌పించారు. చిన్నారికి త్వరతగతిన వైద్యం ఎందుకు అందించడం లేదని అమె అసుపత్రి వర్గాలను నిలదీసారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్‌ ఖేరీ పరిధిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 41 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిచించి చికిత్స అందిస్తున్నారు. 730 నంబర్‌ జాతీయ రహదారిపై బస్సు, మినీ ట్రక్‌ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

దౌరాహా నుంచి లక్నోకు వెళ్తున్న ప్రైవేట్‌ బస్సును ఐరా వంతెన మీద ఎదురుగా వస్తున్న మినీ ట్రక్‌ ఢీకొట్టింది. గాయపడిన వారిలో 12 మందిని లక్నోలోని ట్రామా సెంటర్‌కు తరలించారు మిగతావారు ఖేరీ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్నో డివిజనల్‌ కమిషనర్‌ రోషన్‌ జాకబ్‌ క్షతగాత్రులను చూసేందుకు ఆసుపత్రిని సందర్శించారు. ఈ క్రమంలో ప్రమాదంలో గాయపడిన ఓ చిన్నారి పరిస్థితిని చూసి ఆమె చలించిపోయారు. అతని తల్లితో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. కంటతడి పెట్టుకుంటూనే బాలుడిని ఆప్యాయంగా పరామర్శించారు.

అనంతరం అతనికి మెరుగైన వైద్యం అందించాలని రోష‌న్ జాక‌బ్ వైద్యాధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ చిన్నారి పరిస్థితిని అమ్మగా అర్థం చేసుకున్న ఓ అధికారి ఈ రోజుల్లో ఉండటం.. అందులోనూ చలించిపోవడం అరుదైన విషయమని నెటిజనులు అంటున్నారు. రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని జాతీయ సహాయ నిధి కింద రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఆర్థికసాయం అందించనున్నట్లు పీఎంఓ కార్యాలయం తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles