Woman gives 'cool' responses on child's school form హస్యచతురత కల్గిన రచయితతో పెట్టుకుంటే.. నవ్వులే.. నవ్వులు

Mother s savage response in her 4 year old son s school form internet lauds

Emily Gould, Emily Gould answers in sons' school form, Author Emily Gould, blogger Emily Gould, Emily Gould twitter, mothers brutally honest answers, Emily Gould sense of humour, character development form, son Ilya, sense of humour, school form, New York Magazine, viral, Twitter, viral image, school form, sense of humour, New York Magazine, American mother, viral news

A woman's brutally honest answers in a school form have cracked netizens up. Author and blogger Emily Gould took to Twitter to share a glimpse of the answers she gave in a character development form for her 4-year-old son Ilya. The post is so amusing that you will definitely laud Emily's sense of humour.

హస్యచతురత కల్గిన రచయితతో పెట్టుకుంటే.. నవ్వులే.. నవ్వులు

Posted: 09/22/2022 09:31 PM IST
Mother s savage response in her 4 year old son s school form internet lauds

కొత్తగా పెళ్లైన జంటలు సంతానం కోసం తొందరపడుతుంటారు. సంతానం అంటూ కలిగిన తరువాత.. మూడేళ్లు వచ్చీ రాగానే వారిని పాఠశాలలో చేర్పించక తప్పదు. ఇలా పిల్లలను స్కూల్ లో చేర్పించాలంటే పిల్లల కన్నా వారి తల్లిదండ్రులే ఎక్కువగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఆకాశమంత సినిమాలో తన కూతురు కోసం తండ్రి పాత్రలో నటించిన ప్రకాశ్ రాజ్ తరహలోనే ఇప్పుడు వ్యవహరాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. పిల్లలకు సంబంధించి కొన్ని స్కూల్స్‌లో ఉండే నిబంధనలు, విధివిధానాలు అర్థం చేసుకోవడానికే చాలా టైం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అమెరికాలోని ఓ తల్లికి ఉన్న హస్యచతరుత అమెకు ఎనలేని గుర్తింపు సంపాదించి పెట్టింది.

అమెరికాలో న్యూయార్క్ లో ఫీచర్ రైటర్, రచయిత, బ్లాగర్ గా ఉన్న ఎమిలీ గోల్డ్ అనే ఓ అమ్మకు తన పిల్లాడు చదువుకునే స్కూల్ నుంచి ఒక సర్వే ఫామ్ వచ్చింది. దీనిలో కొన్ని ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. వీటిని చూసిన నెటిజన్లు ఆమె నిజాయితీకి, హాస్య చతురతకు నవ్వుకుంటున్నారు. ఎలాంటి తడబాటు లేకుండా.. నిజాయితీకి నిలువుటద్దంలా సమాధానాలను ఇచ్చారంటూ నెటిజనులు అమెపై ప్రశంసలను కురిపిస్తున్నారు. అంతేకాదు ఆమె రాసిన సమాధానాలు అమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును ఆపాదించిపెట్టాయి.

ఇంతకీ ఏం జరిగిందంటే? తన నాలుగేళ్ల బాబు ఇల్యా చదవుతున్న స్కూల్‌ నుంచి ఓ సర్వే ఫామ్ అమె చేతిలో పడింది. దానిని చదివిన అమె.. ఆ ప్రశ్నలకు విభిన్నంగా బదులు ఇచ్చింది. స్వతహాగా రచయిత అందులోనూ హాస్యచతురత కలిగిన అమెకు నవలలు కూడా రాసే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే స్కూల్ నుంచి తన బిడ్డ తీసుకొచ్చిన ఒక ఫామ్‌ ఫిల్ చేయడానికి కూర్చుంది. దానిలో ప్రశ్నలు చూసి ఆమె ఆశ్చర్యపోయింది. అందుకే వాటికి తగినట్లు ఫన్నీ సమాధానాలు రాసింది. వాటిలో ‘విద్యలో ఈ ఏడాది మీ పిల్లాడు ఏ విషయంపై ఎక్కువ కష్టపడాలని భావిస్తున్నారు?’ అని ప్రశ్న ఉంది. దానికి ఎమిలీ.. ‘అదెవరికి కావాలి? వాడికి జస్ట్ నాలుగేళ్లే’ అని బదులిచ్చింది.

‘మీ బిడ్డ గురించి ఇంకా ఏమైనా చెప్పదలచుకున్నారా?’ అన్న ప్రశ్నకు ఎమిలీ ఇచ్చిన సమాధానం మరింత నవ్వు తెప్పిస్తుంది. ‘ఇల్యాను మీరు కూడా ప్రేమిస్తారు. వాడు ఎంత మంచి, ముద్దులొలికే పిల్లాడంటే.. ఒక్కోసారి వీడు నిజంగా నా కొడుకేనా? లేదంటే పుట్టగానే ఎవరైనా మార్చేశారా? అని డౌట్ వస్తుంది. (అప్పుడే, నా డెలివరీ ఇంట్లోనే జరిగిన విషయం గుర్తొస్తుంది)’ అని ఎమిలీ రాసింది. ఈ సమాధానాలు చదివిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఇకపై తాము కూడా ఆమె సమాధానాలను కాపీ కొట్టేస్తామని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles