Nationwide raids on Muslim group PFI, over 100 arrested పీఎఫ్ఐ కార్యాలయాలపై ఎన్ఐఏ దాడులు..

Over 100 leaders of pfi arrested in pan india crackdown on radical islamic outfit

pfi, what is pfi, popular front of india, pfi kya hai, pfi news, pfi leaders arrested, pfi raids, What is PFI, uttar pradesh, tamil nadu, taliban, simi, popular front of india, PFI India, pfi

In a pan-India crackdown on ‘radical’ Islamic outfit Popular Front of India (PFI), NIA, Enforcement Directorate and concerned state police arrested more than 100 top leaders and functionaries of outfit in coordinated raids across 11 states and Union territories. The states and UTs that saw the raids are Kerala, Maharashtra, Karnataka, Tamil Nadu, Assam, Uttar Pradesh, Andhra Pradesh, Madhya Pradesh, Rajasthan, Delhi and Puducherry.

పీఎఫ్ఐ కార్యాలయాలపై ఎన్ఐఏ దాడులు.. 100 మందికిపైగా అరెస్ట్

Posted: 09/22/2022 08:09 PM IST
Over 100 leaders of pfi arrested in pan india crackdown on radical islamic outfit

రాజీకీయ పార్టీల ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాల వ్యాప్తికి, ఓ వర్గానికి చెందిన యువతను అటువైపుగా ఆకర్షితులను చేస్తున్న పీఎఫ్ఐ కార్యాలయాలపై ఎన్ఐఏ దాడులు నిర్వహిస్తోంది. ఉగ్రవాద కార్యకాలాపాలకు నిధులు సమకూర్చడం, వ్యవస్థీకృత శిక్షణ, తీవ్రవాద భావజాలం వ్యాప్తి వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) కార్యాలయాలు, దాని సభ్యుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహించారు.

ఏపీ, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, అస్సాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో దాడులు జరిగాయి. కేంద్ర హోంశాఖ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ దాడుల్లో 200 మందికిపైగా ఎన్ఐఏ అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 మందికిపైగా పీఎఫ్ఐ సభ్యులను అరెస్ట్ చేశారు. వీరిలో సీనియర్ నేతలు కూడా ఉన్నారు. ఎన్ఐఏకు వ్యతిరేకంగా కర్ణాటకలో ఆందోళన చేపట్టిన పీఎఫ్ఐ, ఎస్‌డీపీఐ సభ్యులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. కేరళలోని మల్లపురం జిల్లా ముంజేరిలోని పీఎఫ్ఐ చైర్మన్ సలాం ఇంటిపై అర్ధరాత్రి మొదలైన దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.

ఈ దాడులపై పీఎఫ్ఐ కేరళ కార్యదర్శి అబ్దుల్ సత్తార్ స్పందించారు. రాష్ట్రంలోని తమ సంస్థ కార్యాలయాలపై ఈడీ, ఎన్ఐఏలు దాడులు చేసిన విషయాన్ని నిర్ధారించారు. నాయకుల ఇళ్లపై అర్ధరాత్రి దాడులకు దిగడం నిరంకుశత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోదాల సందర్భంగా 22 మందిని కేరళలో అరెస్ట్ చేయగా, మహారాష్ట్ర, కర్ణాటకలలో చెరో 20 మందిని అరెస్ట్ చేశారు. తమిళనాడులో 10 మందిని, అసోంలో 9 మందిని, ఉత్తరప్రదేశ్‌లో 8 మందిని, ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురిని, మధ్యప్రదేశ్‌లో నలుగురిని, ఢిల్లీ, పుదుచ్చేరిలో చెరో ముగ్గురిని, రాజస్థాన్‌లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. కాగా, పీఎఫ్ఐ సంస్థను త్వరలో నిషేధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : uttar pradesh  tamil nadu  taliban  simi  popular front of india  PFI India  pfi  

Other Articles