US President Joe Biden appears lost on stage స్టేజీపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ బిత్తర చూపులు

Us president joe biden appears lost on stage after speech at new york

joe biden, joe biden viral video, joe biden lost, joe biden new york event, joe biden new york event news, joe biden news, us president joe biden, Joe Biden, Joe Biden speech, Global Fund Seventh Replenishment Conference Joe Biden, Joe Biden confused on stage, Joe Biden mental health, Viral joe Biden video, us president, joe biden, new york event news, viral video

US President Joe Biden appeared lost on stage after delivering an address at an event on Wednesday. In a viral video, the US President was seen addressing the Global Fund's Seventh Replenishment Conference in New York. After his address, he turned to leave, but stopped and looked lost.

ITEMVIDEOS: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కు ఏమైందీ.? స్టేజీపై బిత్తర చూపులకు అర్థమేమిటీ.?

Posted: 09/23/2022 12:34 PM IST
Us president joe biden appears lost on stage after speech at new york

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచానికే ఒక శాససకర్త. తన దేశాన్ని అగ్రబాగాన నిలుపుతూనే.. దేశంలోని ప్రజల బాగోగులను సమీక్షిస్తూ.. వారి సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూనే.. మరోవైపు ప్రపంచపటంలోని ఏ దేశం ఏం చేస్తుందో కూడా నిత్యం గమనిస్తూ.. డేగ కన్ను పెట్టడం వారి ముఖ్య విధుల్లో ఒకటిగా మారిపోయింది. అయితే తన ఒక్క మాటతో, కను సైగతో ప్రపంచాన్ని శాసించగలిగే వ్యక్తి అగ్రరాజ్యం అధినేత. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మాటే శాసనంలా మిగతా ప్రపంచదేశాలన్నీ ఫాలో కావాల్సిందే. అలాంటి స్థానంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం ఓ వేదికపై చిన్న పిల్లాడిలా వ్యవహరించాడు.

అదేంటి అన్న అనుమానం కలుగుతోంది. ఔను నిజంగా రిపబ్లికన్లు ట్విట్టర్లో పెట్టిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారందరూ ఔను ఏంటీ అధ్యక్షుల వారు ఇలా స్టేజ్ పై చిన్నపిల్లాడిలా వ్యవహరించారేంటి అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో అసలు ఆయనకు ఏమైందీ..? ఏదో మర్చిపోయినట్టు.. దేని గురించో తడుముకుంటున్నట్లు.. ఇంకోదో ఉంది అన్నట్లు గుర్తుకువచ్చి రాకుండా మధ్యలో మధనపడుతున్నట్లుగా ఆయన వ్యవహరించారు. కొన్ని నిమిషాల పాటు ఆయన స్టేజీపై బిత్తర చూపులు చూశారు.

ఓ కార్యక్రమంలో ప్రసంగించిన తర్వాత ఎటు వెళ్లాలో... ఏం చేయాలో తెలియక బైడెన్ తికమక పడ్డ ఓ వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. న్యూయార్క్‌ నగరంలో గ్లోబల్ ఫండ్ సంస్థ  ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తొలుత స్టేజ్‌పైకి వచ్చిన బైడెన్ కాన్ఫరెన్స్ ను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత.. పోడియం దిగేందుకు కుడివైపు కొన్ని అడుగులు వేశారు.  ఆ వెంటనే ఆగి వెనక్కి తిరిగారు. ఎటువెళ్లాలో తెలియక కాస్తంత తికమక పడ్డారు. స్టేజ్ చివర్లో కొన్ని క్షణాల పాటు ఎటూ కదలకుండా నిలబడిపోవడంతో అంతా ఆశ్చర్యపోయారు.

ఇంతలో హోస్ట్ మైక్ తీసుకొని బైడెన్ కు ధన్యవాదాలు చెప్పే సందేశం చదివారు. అప్పుడు కార్యక్రమం ముగిసిందని తెలియడంతో బైడెన్ వెనక్కు తిరిగి అటువైపు వెళ్లారు. ఈ కార్యక్రమానికి హాజరైన వేలాది మంది బైడెన్ ప్రసంగం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కానీ, ప్రసంగం ముగిసిన తర్వాత అమెరికా అధ్యక్షుడి తడబాటుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్లు పెడుతున్నారు. ఏప్రిల్ లోనూ బైడెన్ ఇలాంటి సందర్భం ఎదుర్కొన్నారు. ఎదురుగా ఎవరూ లేకున్నా కరచాలనం చేసేందుకు చేయి ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles