2 "Hybrid Terrorists" Arrested In Jammu And Kashmir: Police జమ్మూలో భద్రతాబలగాలు చిక్కిన ఇద్దరు ఉగ్రవాదులు..

2 hybrid terrorists arrested in anantnag arms and ammunition recovered police

J-K Police, Rashtriya Rifles, Anti-Terror operation, Anantnag, jammu and kashmir, Anti-terror operation, security forces, security forces, Jammu and Kashmir terrorists dead, security forces Encounter, jammu kashmir encounter, Budgam encounter JK, Jammy encounter, CRPF forces, Jammu and Kashmir encounter. terrorists killed in j&k, search operation in J&K, LeT terrorists killed, Pulwama, Jammu and Kashmir, National politics

Two hybrid terrorists, associated with Ansar Ghazwat-ul-Hind terror outfit, were arrested from South Kashmir's Anantnag district. The police, along with the Army, established a Joint naka at Waghama-Opzan Road for the operation. During the checking, the joint party arrested two Hybrid terrorists.

జమ్మూలో భద్రతా బలగాలు చిక్కిన ఇద్దరు ఉగ్రవాదులు..

Posted: 09/20/2022 11:32 AM IST
2 hybrid terrorists arrested in anantnag arms and ammunition recovered police

జమ్మూకాశ్మీర్ లో నిషేధిత ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు భారత భద్రతా బలగాల చేతికి చిక్కారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఏజీయుహెచ్ (AGuH)తో సంబంధం ఉన్న ఇద్దరు హైబ్రిడ్ ఉగ్రవాదులను వాఘమా-ఓప్జాన్ ప్రాంతాల మధ్య భారత బలగాలు అదుపులోకి తీసుకన్నాయి. ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదుల గురించి పక్కా సమాచారం అందుకున్న వాఘమా-ఓప్జాన్ రోడ్‌లో 3వ రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన ఆర్మీ బృందాలు, పోలీసులు సంయుక్తంగా నాకాబందీ ఏర్పాటు చేశారు.

ఆ మార్గం ద్వారా వస్తున్న వారినిపై నిఘా పెట్టి అందరినీ తనిఖీ చేస్తున్న సమయంలో.. ఇద్దరు హైబ్రిడ్ ఉగ్రవాదులు అటుగా రాగా వారిని తనిఖీ చేసిన భారత బలగాలు ఉగ్రవాదులు అని గుర్తించిన బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరిని వాఘమా బిజ్‌బెహరా నివాసి తన్వీర్ అహ్మద్ భట్, మిడోరా ట్రాల్‌లోని అహ్మద్ దార్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

సోదాల్లో వారి వద్ద నుంచి రెండు పిస్టల్స్‌తో పాటు రెండు మ్యాగజైన్లు, 15 రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై బిజ్‌బెహరా పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలోని సంగల్దాన్, గూల్ అటవీ ప్రాంతంలోని ఎత్తైన ప్రాంతాల్లో ఆదివారం భద్రతా దళాలు ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించాయి. చైనా పిస్టల్‌తో సహా భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles