Pakistani passenger creates ruckus on Dubai-bound flight గాల్లో విమానం.. కిందకు దింపాలని ప్రయాణికుడి రచ్చ..

Passenger creates ruckus mid air in peshawar dubai flight blacklisted by pak airlines

passenger onboard, Pakistan International Airlines, mid-air ruckus inside plane, escalation chaos, Namaz on the flight, Aviation, Cabin Crew, Plane, Flight

A passenger created a ruckus on Pakistan International Airlines (PIA) Peshawar-Dubai flight midair and was tied to his seat in accordance with the aviation law to prevent any further escalation in chaos. Notably, a passenger onboard PIA's PK-283 flight indulged in a brawl with the flight crew after indulging in weird activities like punching seats and kicking the aircraft's window.

ITEMVIDEOS: గాల్లో విమానం.. కిందకు దింపాలని ప్రయాణికుడి రచ్చ.. సస్పెన్షన్

Posted: 09/19/2022 10:04 PM IST
Passenger creates ruckus mid air in peshawar dubai flight blacklisted by pak airlines

విమానం కొత్తగా ప్రయాణించే ప్రయాణికులు ఎవరైనా టేకాఫ్ అవుతున్నప్పుడు లేదా ల్యాండింగ్ అవుతున్నప్పుడు భయాందోళనకు గురికావడం సాధారణమే. ఇక అందులోనూ కాసింత కంగారు పడే మనస్తత్వం ఉన్నవాళ్లు మరీనూ. అయితే విమానం గాల్లో ఉండగా మాత్రం ప్రయాణికులందరూ హాయిగా ఫీలవుతుంటారు. కానీ ఇక్కడ ఓ ప్యాసింజర్ మాత్రం తనను వెంటనే కిందకు దించివేయాలని నానా హంగామా చేశారు. విమానాన్ని తక్షణం కిందకు దింపాలని రచ్చరచ్చ చేశాడు. దీంతో అతనిపై ఏవియేషన్ విభాగం ఇక ముందు విమానంలో ప్రయాణించకుండా సస్పెన్షన్ ను విధించింది.

విమానం సీట్ల మధ్య సిబ్బంది నడిచే దారిలో పడుకుని నమాజ్ చేశాడు. అయితే దానిని అడ్డుకున్న విమాన సిబ్బంది అతడ్ని లేపి సీట్లో కూర్చోబెట్టారు. అక్కడి నుంచి కదలకూడదని చెప్పారు. అయినా బట్టలు విప్పేసుకుని హల్‍చల్ చేశాడు. విమానం కిటికీని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించాడు. సీట్లను పదే పదే తన్నాడు. ఆపేందుకు ప్రయత్నించిన తోటి ప్రయాణికులపైనా దాడి చేశాడు. పాకిస్థాన్ ఇంటర్నేషన్ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానంలో గతవారం ఈ ఘటన జరిగింది. సెప్టెంబర్ 14న పెషవార్ నుంచి దుబాయ్‌కు వెళ్తున్న పీకే-283 విమానంలో ఈ ఘటన జరిగింది.

విమానం టేకాఫ్ అయిన కాసేపటికే  ఓ ప్యాసెంజర్ విచిత్రంగా ప్రవర్తించసాగాడు. విమానంలో ప్రయాణికులు నడిచే ఫ్లోర్‌పై బోర్లా పడుకుని ప్రార్థనలు చేయాలని ఇతరులకు సూచించాడు. సిబ్బంది ఆపేందుకు ప్రయత్నించినా ఊరుకోలేదు. వారితో దురుసుగా ప్రవర్తించి బెంబేలెత్తించాడు. అయితే అతడి చర్యలకు తోటి ప్రయాణికులు హడలిపోయారు. ప్రయాణికుడి చేష‍్టలకు విసిగిపోయిన సిబ్బంది నిబంధనల ప్రకారం అతడ్ని సీటుకు కట్టేశారు. అతడు మరోసారి విమానం ఎక్కకుండా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చారు. ప్యాసెంజర్ ప్రవర్తనకు సంబంధించిన వీడియోను తోటి ప్రయాణికుడు ఒకరు ట్విట్టర్‌లో షేర్ చేయగా అది వైరల్‌గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles