Earthquake rocks Mexico on ‘cursed’ anniversary మెక్సీకోను కుదిపేసిన భారీ భూకంపం.. 7.4గా తీవ్రత నమోదు

7 6 magnitude earthquake hits mexico leaving one dead triggers tsunami warning

Earthquake, Earthquake in Mexico, Mexico Earthquake, Mexico City, Tsunami Warning, Tsunami Alert, United States Geological Survey, USGS, Mexico, Mexico Earthquake, Mexico earthquake 2022, earthquake news, earthquake, earthquake videos, mexico earthquake news

An earthquake hit western Mexico, 19 September, leaving at least one person dead. The United States Geological Survey (USGS) has reported the magnitude of the earthquake to be 7.6. Mexican President Andres Manuel Lopez Obrador tweeted that the individual was killed in Manzanillo, which is approximately 130 km south of Michoacan.

ITEMVIDEOS: మెక్సీకోను కుదిపేసిన భారీ భూకంపం.. 7.4గా తీవ్రత నమోదు

Posted: 09/20/2022 12:42 PM IST
7 6 magnitude earthquake hits mexico leaving one dead triggers tsunami warning

మెక్సికోలోని సెంట్రల్‌ పసిఫిక్‌ తీరంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దాని తీవ్రత 7.4గా నమోదైందని మెక్సికో జాతీయ భూకంప శాస్త్ర సంస్థ తెలిపింది. కాగా, భూమి ప్రకంపించిన తీవ్రత 7.6గా నమోదైందని.. యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే అంచనా వేసింది. కాగా ఈ భూ ప్రకంపనలతో సునామీ హెచ్చరికలను కూడా అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ జారీ చేసింది. పసిఫిక్ తీరంలోని మైకోకాన్ రాష్ట్రంలోని కోల్‌కోమన్‌కు దక్షిణంగా 59 కిలోమీటర్లు, అక్విలాకు ఆగ్నేయంగా 37 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు మెక్సికన్ భూకంప శాస్త్రవేత్తల పేర్కొన్నారు.

భూకంపంతో కోలోకోమన్‌ పట్టణంలో భవనాలు పగుళ్లుబారాయి. భారీ ప్రకంపన ధాటికి భవనాలు వణికిపోగా.. జనం భయంతో పరుగులు పెట్టారు. అయితే, భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరుగలేదని మెక్సికో సిటీ మేయర్‌ క్లాడియా షీన్‌బాయ్‌ ట్వీట్‌ చేశారు. అయితే పలు చోట్ల ఆస్తినష్టం వాటిల్లిందన్న వార్తలు అందాయి. కాగా, ఒక్కరు మాత్రం భూమి ప్రకంపనల ధాటికి మరణించడంతో ప్రాణనష్టం అంతకుమాత్రమేపరిమితం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మెక్సికోలోని మిచోకాన్ సముద్ర తీరం వెంబడి సునామీ వచ్చే అవకాశం ఉందని అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ హెచ్చరికలు జారీ చేసింది.

అయితే ప్రకంపనల ధాటికి విలాసవంతమైన బహుళ అంతస్థుల నివాసాలపై ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్ లలో మాత్రం మినీ సునామీ వచ్చిందని కొందరు చమత్కరిస్తున్నారు. రోడ్లు, వంతెనలు, భవనాలు, హోటల్ గదుల్లోని ఫ్యాన్లు, లైట్లు ఎవరో వాటిని ఊపుతున్నట్లుగా ఊగుతూ హారర్ చిత్రాలను తలపించాయి. ఇక ఓ కారు గ్యారేజ్ లోని కార్లు కూడా వాటికి ఎవరో ఊపుతున్నట్లుగా ఊగాయి. ఈ ఘటనలతో మెక్సికన్ వాసులు భయాందోళనకు గురయ్యారు. మెక్సికన్ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.05 నిమిషాలకు భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి.


కాగా, మిచికన్ పబ్లిక్ సెక్యూరిటీ డిపార్టుమెంట్ మాత్రం ప్రస్తుతానికి ఎక్కడ ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు తమకు సమాచారం అందలేదని తెలిపారు. ఇక ఆస్తినష్టం అంచనా వివరాలు కూడా తాము సేకరిస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా.. 1985, 2017 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు మెక్సికోలో భూకంపాలు నమోదయ్యాయి. మళ్లీ అదే రోజు భారీ ప్రకంపనలు రావడం ప్రస్తావనార్హం. సెప్టెంబర్‌ 19, 1985న మెక్సికో నగరంలో 8.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాదాపు 10వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. 2017లో రిక్టర్‌ స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూమి కంపించగా.. 370 మంది ప్రాణాలు కోల్పోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles