ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ సీట్ల పెంపుపై పిటిషన్ను దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఉమ్మడి రాష్ట్రాన్ని పునర్విభజిస్తూ జారీ చేసిన చట్టం పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరగాల్సిన అసెంబ్లీ స్థానాలు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెంచకపోవడంపై ఏకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ పిటీషన్ ను అత్యున్నత న్యాయస్థానం విచారణకు స్వీకరచింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎన్నికల సంఘానికి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏపీలో అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు, తెలంగాణలో 119 నుంచి 153కు అసెంబ్లీ స్థానాలను పెంచాలని పిటిషన్ దాఖలైంది. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జారీ చేసిన జీవో అధారంగా రెండు తెలుగురాష్ట్రాలలో అసెంబ్లీ స్థానాలను పెంచడంలో కేంద్రప్రభుత్వం ఎనిమిదేళ్లు కావస్తున్నా ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తూ.. 2026లో దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాల పెంపు జరిగే క్రమంలోనే చేపడతామని చెబుతూవస్తోంది. కాగా, ఈ మధ్య జమ్మూ, కశ్మీర్లకు సంబంధించిన అసెంబ్లీ సీట్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఒక డీలిమిటేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
ఈ క్రమంలోనే జమ్మూలోనూ, కశ్మీర్లోనూ అసెంబ్లీ సీట్లను పెంచారు. ఈ నేపథ్యంలోనే ఏపీ, తెలంగాణలో కూడా అసెంబ్లీ సీట్లను పెంచాలని సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు. ఈ మేరకు పర్యావరణ నిపుణుడు, ఫ్రోఫెసర్ పురుషోత్తం రెడ్డి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం 2014లో పేర్కొన్న నిబంధనలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోర్టును కోరారు. ఈ మేరకు విచారణ జరిపిన జస్టిస్ జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 29న సుప్రీంకోర్టులో ఇందుకు సంబంధించిన కేసు విచారణ జరిగే అవకాశం ఉంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more