cow calf runs to cemetery to say goodbye to owner యజమాని కోసం శ్మశానవాటికకు వెళ్లిన ఆవు.. కన్నీటి వీడ్కోలు

Viral video calf runs to cemetery to say goodbye to dead owner cries beside his body

Viral Video, social media, cow calf, buffalo owner, gangaram, Hazaribagh, Jharkhand, video viral, Google Trends Today, Trending Video, Trending Video Today, Viral Video Today, viral news, trending news, viral, emotional video, heartbreaking video

A heartbreaking video is going viral on social media where a buffalo calf came to say a final goodbye to his owner who died. The incident is from Hazaribagh in Jharkhand where a cattle owner died and his body was taken to a cemetery (shamshan ghat) for the funeral.

ITEMVIDEOS: యజమాని కోసం శ్మశానవాటికకు వెళ్లిన ఆవు.. కన్నీటి వీడ్కోలు

Posted: 09/17/2022 12:49 PM IST
Viral video calf runs to cemetery to say goodbye to dead owner cries beside his body

తమను ప్రేమ, అప్యాయలతో చూసుకునే యజమాని మరణించాడన్న వార్త ఆ చిన్నారిని ఇంట్లో ఉండనీయలేదు. తాను బయటకు వెళ్లనీయకుండా కట్టిన బంధనాలను సైతం తెంచుకుని యజమాని కడసారి చూపుకోసం పరుగులు తీసింది. మనసున్న మనుషులుగా కూడా తోటివారి అంత్యక్రియులకు హాజరుకాలేకపోతున్నామని, అందుకు తమ ఆపీసు కార్యాలు అడ్డుగా నిలుస్తున్నాయంటూ అంగరాల్చే నేటి బాంధవ్యాల మధ్య.. యజమాని వేసే వాచవియైన గడ్డి తిన్న విశ్వాసం.. ఆయన తమ పట్లు చూపిన ప్రేమ గుర్తుకువచ్చి.. పెంచుకునే జీవి పరితపించిన విధానం అక్కడి స్థానికులను కన్నీరు పెట్టించింది.

యజమాని ఎలా ఉండాలో.. అప్పుడా జీవాలు ఎలా ఉంటాయో మృతుడు తెలియజెప్పాడు. కాగా యజమానితో ఉన్న బంధాన్ని ఏ మూగజీవి మర్చపోదని ఈ దూడ గుర్తు చేస్తోంది. ఒక దూడ పరుగున శ్మశానవాటికకు చేరుకుంది. మరణించిన యజమాని మృతదేహం వద్దకు వెళ్లి కన్నీరు కార్చింది. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తుది వీడ్కోలు పలికింది. ఈ హృదయవిదారక సంఘటన జార్ఖండ్‌లో జరిగింది. హజారీబాగ్‌ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల చనిపోయాడు. దీంతో బంధువులు, స్నేహితులు అంత్యక్రియల కోసం మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. అంత్యక్రియలు జరిపేందుకు సిద్ధమయ్యారు.

ఇంతలో చనిపోయిన వ్యక్తికి చెందిన పశువుల్లోని ఒక దూడ పరుగున శ్మశానవాటికకు వచ్చింది. తనను ఎంతో ప్రేమగా చూసుకునే యజమాని కోసం వెతికింది. అక్కడున్న వారు పక్కకు జరుగడంతో చివరకు అతడి మృతదేహం వద్దకు చేరుకుంది. యజమాని ముఖాన్ని నాకి కన్నీరు కార్చింది. అంతేగాక అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నది. ఇది చూసి మృతుడి బంధువులు, స్నేహితులు ఆశ్చర్యపోయారు. కాగా, ఒక యూజర్‌ ట్విట్టర్‌లో గురువారం పోస్ట్‌ చేసిన ఈ హృదయవిదారక వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles