విద్యార్థులపై చేయి చేసుకుంటే నేరంగా పరిగణిస్తారన్న విషయం తెలిసి.. ఇలాంటి పలు ఘటనల్లో కొందరు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, జైలు శిక్షలకు వెళ్లిన తరువాత కూడా లెక్చరర్ల ధోరణిలో మార్పు రావడం లేదు. విద్యార్థిపై చేయి చేసుకోవడమే కాకుండా కాలితో తన్ని.. ఆ తరువాత కూడా తన అహం సంతృప్తి చెందకపోవడంతో వీపుపై ఎడాపెడా కోట్టిన ఓ లెక్చరర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. విద్యార్థులకు పాఠాలను అర్థమయ్యేలా చెప్పాడంతో పాటు.. అందుకుగాను సులువైన మార్గాలను, ఉదాహరణలను ఇవ్వాలి.. కానీ గుడ్డి ఎద్దు చేలో పడినట్టుగా కంఠస్థం చేయించి.. అవి రాకపోతే లెక్చరర్లు విద్యార్థులను గొడ్డును బాధినట్టుగా బాదేస్తున్నారు.
ఇలా ఓ విద్యార్థిపై తన ప్రతాపాన్ని చూపి.. చెంపలు వాయించి.. అంతటితో ఆగకుండా కాలితో తన్ని.. ఆపైన వీపుపై ఎడాపెడా వాయించిన లెక్చరర్ ఇప్పుడు రోడ్డునపడ్డారు. అతడ్ని కాలేజీ యాజమాన్యం విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం లెక్చరర్‌ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంఘటన విజయవాడ బెంజి సర్కిల్లోని భాస్కర్ భవన్ క్యాంపస్‌లో చోటుచేసుకున్నది. విద్యార్థిపై చేయి చేసుకోవడంతో పాటు కాలితో తన్నిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం సదరు లెక్చరర్‌ను విధుల నుంచి తప్పించింది.
తరగతిలో తోటి విద్యార్థితో మాట్లాడిన ఓ విద్యార్థిని శ్రీ చైతన్య కాలేజీ లెక్చరర్ అందరి ముందే చెంపపై వాయించాడు. అంతటితో ఊరుకోకుండా కాలితో తన్నాడు. ఈ ఘటనను తరగతిలోని మరో విద్యార్థి వీడియో తీసి తల్లిదండ్రులకు పంపడంతో గొడవ పెద్దగా మారింది. శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఈ ఘటనను జిల్లా విద్యాశాఖ, చైల్డ్‌లైన్ అధికారులతో పాటు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇంటర్ బోర్డు స్థానిక ఇన్స్పెక్టర్ రవికుమార్, జిల్లా విద్యాశాఖాధికారి రేణుక కళాశాలకు వెళ్లి ఘటనపై ఆరా తీశారు.
సదరు విద్యార్థి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటున్నాడని, పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో కోపం వచ్చి కొట్టినట్లు లెక్చరర్ వివరించారు. అయితే ఈ వార్డులో ఫోన్ తీసుకెళ్లేందుకు విద్యార్థులకు అనుమతి లేదని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. అలాంటప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వినే అవకాశమే ఉండదని వారు వాదిస్తున్నారు. కట్టడి పేరుతో విద్యార్థులను దండించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్ మేరకు సదరు లెక్చరర్‌ను సస్పెండ్ చేసినట్లు ఆర్ఐఓ తెలిపారు.
#BreakingNews #CaughtOnCam
— Phanindra Papasani (@PhanindraP_TNIE) September 16, 2022
Staff of #SriChaitanya's Bhaskar Bhavan in #Tadigadapa near #Vijayawada inhumanly slapped a student and thrashed him with leg. Fellow student recorded & posted it in WhatsApp groups.#SFI demands action.#AndhraPradesh@VjaCityPolice@APPOLICE100 pic.twitter.com/f3vDi4qP7f
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more