Lalu Yadav to visit Singapore for treatment as CBI court gives nod లాలుకు ఊరట.. పాస్‌పోర్ట్‌ అందించాలని సీబీఐ కోర్టు అదేశం..

Lalu prasad yadav gets big relief court orders in favour of rjd chief convicted in fodder scam

lalu prasad yadav, lalu prasad yadav news, lalu prasad yadav passport, lalu prasad yadav singapore, lalu prasad yadav cbi court, Special CBI Court, fodder scam, passport, singapore, treatment, Bihar Fodder Scam, Tejashwi Yadav, Bihar, Politics

Rashtriya Janata Dal (RJD) supreme Lalu Prasad Yadav, convicted in multiple cases related to fodder scam, will be able to fly to Singapore for medical treatment after a special CBI court ordered the release of his passport on Friday, September 16. Lalu Prasad Yadav had filed a petition in the CBI court on September 13 seeking release of the passport, citing medical reasons.

లాలు ప్రసాద్ యాదవ్‌కు ఊరట.. పాస్‌పోర్ట్‌ అందించాలని సీబీఐ కోర్టు అదేశం..

Posted: 09/17/2022 11:58 AM IST
Lalu prasad yadav gets big relief court orders in favour of rjd chief convicted in fodder scam

దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన పశువుల దాణా కుంభకోణానికి సంబంధించి రాష్ట్రీయ జనతాదళ్‌ అధ్యక్షుడు, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్‌ యాదవ్‌ దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ఐదు వేర్వేరు కేసుల్లోనూ ఆయన దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న ఆయనకు ప్రస్తుతం ఆయనకు కొంత ఊరట లభించింది. లాలు సెప్టంబర్‌13న పాస్‌పోర్ట్‌ తిరిగి ఇ‍వ్వాలని కోరతూ కోర్టుకి దరఖాస్తు పెట్టుకున్నారు. ఐతే సెంట్రల్‌ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) ప్రత్యేక కోర్టు ఆయనకు అనుకూలంగా పాస్‌పోర్ట్‌ తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పుడూ పాస్‌పోర్ట్‌ వెనక్కి తీసుకోవాలంటే యాదవ్‌ కోర్టులో అఫిడవిట్‌ సమర్పించాల్సి ఉంటుందని యాదవ్‌ తరుఫు న్యాయవాది ప్రభాత​ కుమార్‌ అన్నారు. ఇదిలా ఉండగా సింగపూర్‌ వైద్యుడు సెప్టెంబర్‌24న లాలు యాదవ్‌కు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఐతే ఆయన ఆ తేదికి ముందుగానే సింగపూర్‌ చేరుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఆయనకు త్వరితగతిన పాస్‌పోర్ట్‌ని తిరిగి ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేగాదు రెండు నెలల పాటు సింగపూర్‌లో ఉండేలా కూడా పాస్‌పోర్ట్‌ జారీ చేయాలని న్యాయవాది అభ్యర్థించారు.

లాలు దరఖాస్తును విచారించిన కోర్టు...అతడికి పాస్‌పోర్టు జారీ చేయాలని ఆదేశించింది. వాస్తవానికి 1996 దాణా కుంభకోణం కేసులో 900 కోట్ల కుంభ కోణం జరిగిందని, దీనికి సంబందించి మొత్తం ఆరు కేసులు లాలుపై ఉన్నాయి. అందులో ఒక కేసులో లాలుకు 2013లో ఐదేళ్ల శిక్ష పడింది. దీంతో ఆయన ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై బయట ఉన్నారు. ఇదిలా ఉండగా లాలు దాణా కుంభకోణానిక సంబంధించి అన్ని కేసులను విచారించాలని లాలు కోర్టుకి విజ‍్క్షప్తి కూడా చేసుకున్నారు. కానీ సుప్రీం కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ప్రతికేసు విచారణను విడివిడిగా నిర్వహించాలని ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles