Four arrested in e-bike showroom fire case ఈవీ షోరూమ్ అగ్నిప్రమాదం.. పోలీసుల అదుపులో నలుగురు..

Four arrested in secunderabad electric bike showroom fire accident

Electrical Vehicles showroom, Electric vehicle battery blast, Electric vehicle battery explosion, Electric Vehicle charging, EV vehicles battery overnight charging, Ruby Lodge, Rajender singh, Sunith singh, Supreeth singh, Supreeth singh absconding, Sudharshan Naidu, Eight dead in Ruby lodge, Victim families, secundrabad fire accident, ruby hotel fire accident, Electric bikes battery blast, Secundrabad, Telangana, Crime

Hyderabad police arrested four persons in connection with the fire mishap at an e-bike showroom and a hotel which claimed eight lives earlier this week. Hotel owner Rajender Singh, his son Sumeet Singh, manager, and supervisor have been arrested by the police. They were booked for culpable homicide not amounting to murder.

ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ అగ్నిప్రమాదం.. పోలీసుల అదుపులో నలుగురు..

Posted: 09/14/2022 12:57 PM IST
Four arrested in secunderabad electric bike showroom fire accident

సి‌కింద్రాబాద్ లోని ఎలక్ట్రిక్ వాహన షోరూంలో సొమవారం రాత్రి సంభవించిన ఘోర అగ్నిప్రమాదం ఎనమిది మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణమైన నలుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాడ్జీలో దిగిన కస్టమర్లతో పాటు సిబ్బంది సహా ఎనమిది మంది ప్రాణాలు బలిగొనేందుకు కారణమైన రూబీ లాడ్జీ ఓనర్ రాజేందర్ సింగ్, ఆతని కుమారుడు సునీత్ సింగ్ తో పాటు లాడ్జీ మేనేజర్, సూపర్ వైజర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూబీ లాడ్జి కింద రూబీ ఎలక్ట్రికల్ షోరూమ్ కూడా ఏర్పాటు చేయడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్థారించిన పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో రూబీ ఎలక్ట్రికల్ బైక్ షో రూమ్‌ను మూసేసి రాజేందర్ సింగ్‌, అతని కుమారుడు సునీత్ సింగ్ కార్ఖానాలోని ఇంటికి వెళ్లారు. 9.45గంటల సమయంలో లాడ్జ్‌లో పనిచేసే సిబ్బంది అగ్ని ప్రమాదం గురించి రాజేందర్ సింగ్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి వచ్చిన ఆయన పరిస్థితి తన చేతుల్లో లేదని.. తన చేయిదాటి పోయిందని తెలుసుకున్నాడు. అప్పటికే 8 మంది చనిపోయారనే విషయం తెలుసుకొని ఘటనాస్థలం నుంచి రారయ్యారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ భవన యజమాని, రూబీ ఎలక్ట్రికల్ షోరూం యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

రాజేందర్ సింగ్‌కు ఇద్దరు కుమారులు. వారిలో సునీత్ సింగ్ షోరూమ్ నిర్వహిస్తుండగా... తండ్రి రాజేందర్ సింగ్, మరో కుమారుడు సుప్రీత్ సింగ్ కలిసి లాడ్జ్‌ను నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే లాడ్జ్ ను సీజ్ చేశారు. పరారీలో ఉన్న రాజేందర్ సింగ్, ఆయన కుమారుల కోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. వారు కిషన్ బాగ్‌లో ఉన్నట్లు తెలుసుకొని, అక్కడికి వెళ్లి రాజేందర్ సింగ్, ఆయన కుమారుడు సునీత్ సింగ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వాళ్లిచ్చిన సమాచారం మేరకు లాడ్జ్ మేనేజర్ సుదర్శన్ నాయుడు, సూపర్ వైజర్లను అదుపులోకి తీసుకుని మార్కెట్ పోలీసులకు అప్పగించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles