పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పాలనను వ్యతిరేకిస్తూ బీజేపి చేపట్టిన ‘చలో సచివాలయం’ నిరసన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హింసగా దీనిని బెంగాల్ పోలీసులు బావిస్తున్నారు. ఏకంగా తమనే టార్గెట్ చేసి.. దాడులు చేయడంపై పోలీసులు విస్మయం వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల నిరసనకారులను అడ్డుకొనేందుకు వచ్చిన పోలీసులపై భౌతిక దాడులు జరగడం వివాదాస్పదంగా మారింది. కోల్‌కతాలో ఓ పోలీసును బీజేపి జెండాలు పట్టుకున్న ఆందోళనకారులు కర్రలతో చితకబాదిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
రాష్ట్ర రాజధాని కోల్‌కతాతో పాటు హౌరా సహా పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకొన్నాయి. ఛలో సచివాలయ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు బీజేపి కార్యకర్తలను అడ్డుకోవడంతో కాషాయ పార్టీ జెండాలు పట్టుకున్న నిరసనకారులు అతడిని చుట్టుముట్టారు. కర్రలతో ఆయనపై విచక్షణారహితంగా దాడిచేశారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఆ పోలీసు అక్కడి నుంచి పరుగులు తీసినప్పటికీ.. ఆందోళనకారులు వెనకే వెళ్లి ఆయనపై దాడికి దిగారు. దీంతో ఆయన అక్కడే ఉన్న బ్యారికేడ్ వద్ద పడిపోయారు. అయినా అతనిపై దాడి ఆగలేదు. ఆ తర్వాత కొందరు స్థానికులు వారిని అడ్డుకొన్నారు.
అయితే కాషాయ జెండాలు పట్టుకున్నవారి చేతిలో దాడికి గురైన అధికారి పోలీసు అసిస్టెంట్ కమీషనర్ అని వార్తలు వినబడుతున్నా.. ఆయనకు సంబంధించిన వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. అంతటితో ఆగని అందోళనకారులు పోలీసువాహనానికి నిప్పుపెట్టారు. పోలీసు వాహనానికి ఆందోళనకారులు నిప్పుపెడుతున్న క్లోజ్‌అప్ వీడియోను కాంగ్రెస్ నేతలు ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అందులో ఓ వ్యక్తి సిగరెట్ లైటర్‌తో కారుకు నిప్పంటిస్తున్నట్లుగా ఉంది. ఈ వీడియోను షేర్ చేస్తూ బీజేపిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. కాగా ఇది పోలీసుల పనేనంటూ బీజేపి ఎదురుదాడికి పాల్పడింది.
ఈ హింసాత్మక ఘటనలపై అధికార టీఎంసీ.. బీజేపిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. ఈ వీడియోను టీఎంసీ ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘‘బీజేపి నిజస్వరూపం బయటపడింది. రాఖీ పర్వదినం రోజున బీజేపి నేతలు పోలీసులకు రాఖీలు కట్టి వారితో ఫొటోలు దిగారు. మిగిలిన రోజుల్లో ఇలా ప్రవర్తిస్తున్నారు. ఇదేనా పోలీసులకు మనమిచ్చే గౌరవం..? ఎండనకా.. వాననకా ప్రజలను రక్షించడం కోసం పనిచేస్తోన్న వారిపై ఇటువంటి దాడులు జరగడం విచారకరం’’ అని మండిపడింది. అయితే, ఈ వీడియోపై బీజేపి నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న నిరసనకారులపైకి పోలీసులు రాళ్లు విసిరి వాళ్లను రెచ్చగొట్టారని కేంద్రమంత్రి సుభాష్ సర్కార్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
This is the BJP mob beating a #Kolkata Police officer !
— Tehseen Poonawalla Official (@tehseenp) September 13, 2022
He looks to be an Assistant Commissioner of Police! I leave it with one question- which ever part of our country there is violence: why are BJP supporters always consistently involved? Be it UP, WB, Kerala etc? pic.twitter.com/lfDxBwfNFf
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more