Delta deadliest among COVID-19 variants, say CCMB డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకారి సీసీఎంబీ అధ్యయనం

Ccmb study demonstrates delta variant of corona could evade immune system better

Delta variant, Dangerous, Centre for Cellular and Molecular Biology (CCMB), Microbiology Spectrum journal, human immunity, defence molecules, SARs-CoV-2, Dr. Krishnan Harshan, Dr Sudhakar Digumarthi, Dr. Divya Tej Sowpati, CSIR-CCMB, Covid-19

A group of researchers from the Hyderabad-based Centre for Cellular and Molecular Biology (CCMB) in a study have found that human immunity could not produce the necessary defence molecules against the Delta variants of SARs-CoV-2, as effectively as they did with other variants. A release said the study, which was published recently in the Microbiology Spectrum journal, demonstrated how the Delta variant could evade the human immune system effectively when compared to other variants of SARs-CoV-2.

కరోనా డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకారి: సీసీఎంబీ అధ్యయనంతో తేలిన నిజం!

Posted: 09/14/2022 11:45 AM IST
Ccmb study demonstrates delta variant of corona could evade immune system better

చైనాలో పురుడుపోసుకుని ప్రపంచవ్యాప్త మానవాళికి సవాల్ విసిరి.. లక్షలాధి మందిని పొట్టనపెట్టుకున్న కరోనా మహమ్మారి తన ప్రభావాన్ని తగ్గించుకున్నా.. ఇప్పటికీ దాని తీవ్రతపై అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలపై పెను ప్రభావం చూపి ప్రజల ప్రాణాలతో పాటు దేశ అర్థిక వ్యవస్థలను కూడా కుదేలయ్యేలా చేసిన ఈ మహమ్మారి.. దేశంలోనూ మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే రెండో దశలో దేశంలో తీవ్ర ప్రభావాన్ని చూసింది. దీంతో ఈ దశలో వచ్చిన డెల్టా వేరియంట్‌కు సంబంధించి హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) అధ్యయనాలు చేస్తూనే ఉంది.

సిసిఎంబి-సీఐఎస్ఆర్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో తాజగా మరో ఆందోళనకర అంశం వెలుగులోకి వచ్చింది. కరోనా వైరస్‌లోని అన్ని వేరియంట్ల కంటే డెల్టా అత్యంత ప్రమాదకరమైనదని ఈ అధ్యయనంలో గుర్తించారు. సార్క్- కోవ్- 2 వైరస్ సోకిన వ్యక్తులు ఒక్కో వేరియంట్‌కు ఒక్కోలా స్పందిస్తారా? లేదా? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు సీసీఎంబీ ఈ అధ్యయనం చేసింది. ఇందులో భాగంగా కరోనా రకాలైన ఆల్ఫా, డెల్టాతోపాటు అంతకుముందు వెలుగుచూసిన మూడు వేరియంట్లపై పరిశోధన నిర్వహించారు. అయితే, ఇతర వేరియంట్లతో పోలిస్తే డెల్టా వేరియంట్ సోకినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ సమర్థమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేయని విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

మిగతా నాలుగు వేరియంట్ల విషయంలో రోగ నిరోధక వ్యవస్థకు హెచ్చరికలు అందినప్పటికీ డెల్టా విషయంలో అలా జరగలేదని గుర్తించారు. డెల్టా విషయంలో యాంటీబాడీలు శక్తిమంతం కావని తెలుసుకున్నారు. దీంతో శాస్త్రవేత్తలు ఈ వేరియంట్ విషయంలో ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ సందర్భంగా అధ్యయనకారులు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేరియంట్లు వ్యాపిస్తున్నాయని, కానీ వాటి ప్రభావంలో చాలా తేడాలు ఉన్నట్టు గుర్తించామన్నారు. అన్నింటికంటే కూడా డెల్టా వేరియంట్ అత్యంత ప్రమాదకారన్న విషయాన్ని గుర్తించినట్టు వారు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles