councillor loses post for not declaring 500 kg ornaments ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం.. కౌన్సిలర్ ఎన్నిక కొట్టివేసిన రద్దు..

Karnataka councillor with bpl card loses post after court finds he has 500 kg jewellery

bpl, city municipal council, sira, ravishankar, congress, karnataka municipalities act, bpl, Karnataka councillor, JD(S) councillor, Gold ornaments, Gold jewellery, Politics, Magistrate court, Tumakuru, Karnataka, Politics

A magistrate court has declared as null and void the election of a JD(S) councillor to a local body in Tumakuru in Karnataka, after he did not rebut the petitioner's claims of possessing 500 kg ornaments despite having a BPL card. Senior Civil Judge and Judicial Magistrate of First Class of Sira, Geethanjali G found K Ravishankar, councillor of Ward-9 of Sira City Municipal Council, guilty of suppressing facts in his election affidavit.

ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం.. కౌన్సిలర్ ఎన్నిక కొట్టివేసిన రద్దు..

Posted: 09/10/2022 01:42 PM IST
Karnataka councillor with bpl card loses post after court finds he has 500 kg jewellery

ఎన్నికల అఫిడవిట్ లో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందించిన ఓ మున్సిపాలిటీ కౌన్సిలర్ కు న్యాయస్థానం దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది. క‌ర్నాట‌క‌కు చెందిన ఓ కౌన్సిల‌ర్ త‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్‌లో త‌ప్పుడు స‌మాచారాన్ని పొందుప‌రిచిన కేసులో స్థానిక మెజిస్ట్రేట్ కోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది. జనతాదళ్ (సెక్యూలర్) పార్టీ నుంచి గెలుపొందిన స్థానిక కౌన్సిల‌ర్ ర‌వి శంక‌ర్ ఎన్నికను న్యాయస్థానం కొట్టివేసింది. స్థానిక నాయకుడైన రవిశంకర్ ఉద్దేశపూర్వకంగా తనకు సంబంధించిన సమాచారాన్ని రాజ్యాంగం ప్రకారం ఎన్నికల సంఘానికి తెలియపర్చడంలో తప్పులు చేశారని న్యాయస్థానం పేర్కొంది.

అయితే రవిశంకర్ ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు సమాచారం ఇచ్చాడని నిరూపించబడిందని పేర్కోన్న న్యాయస్థానం.. అతని ఎన్నిక చెల్ల‌ద‌ని తీర్పును వెలువరించింది. ర‌విశంక‌ర్‌కు బీపీఎల్ కార్డు ఉన్నా.. అత‌ను త‌న అఫిడ‌విట్‌లో 500 కేజీల ఆభ‌ర‌ణాల గురించి వెల్ల‌డించ‌లేద‌ని మెజిస్ట్రేట్ తెలిపింది. సీనియ‌ర్ సివిల్ జ‌డ్జి గీతాంజ‌లి ఈ కేసును విచారించారు. సిరా మున్సిప‌ల్ కౌన్సిల్ 9వ వార్డు కౌన్సిల‌ర్ ర‌విశంక‌ర్ త‌న పూర్తి స‌మాచారాన్ని దాచాడ‌ని, ఆ కేసులో అత‌ను దోషిగా తేలిన‌ట్లు కోర్టు చెప్పింది.

ఎన్నిక‌ల్లో ఓడిన కాంగ్రెస్ అభ్య‌ర్థి కృష్ణ‌ప్ప‌..2021 డిసెంబ‌ర్‌లో కోర్టు కేసు న‌మోదు చేశారు. క్రిమిన‌ల్ కేసులు ఉన్న విష‌యాన్ని అఫిడ‌విట్‌లో ర‌విశంక‌ర్ పేర్కొన‌లేద‌ని ఆరోప‌ణ‌లు చేశాడు. కౌన్సిల‌ర్ ర‌విశంక‌ర్ వ‌ద్ద 500 కిలోల ఆభ‌ర‌ణాలు ఉన్నాయ‌ని, 3.6 ల‌క్ష‌ల కిరాయి వ‌స్తుంద‌న్న విష‌యాన్ని కూడా అఫిడ‌విట్‌లో చెప్ప‌లేద‌ని అత‌నిపై కేసు బుక్ చేశారు. ర‌విశంక‌ర్ వ‌ద్ద బీపీఎల్ కార్డు కూడా ఉన్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే పాత క్రిమిన‌ల్ కేసుల గురించి అఫిడ‌విట్ లో ప్ర‌స్తావించ‌లేద‌ని ర‌విశంక‌ర్ కోర్టుకు తెలిపారు. త‌న వ‌ద్ద 499.5 కేజీల వెండి, 500 గ్రాముల బంగారం ఉన్న‌ట్లు కోర్టుకు వెల్ల‌డించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles