కేరళ ట్రాఫిక్ పోలీసులు తీరుపై నెటిజనులు విభిన్నంగా స్పందిస్తున్నారు. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు క్రమంగా పెరుగుతున్న వేళ.. అసలు వాటిని ఎందుకు అంతలా ప్రపంచ దేశాలు కూడా ప్రోత్సహిస్తున్నాయో కూడా కేరళా పోలీసులకు తెలియదా.? అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మనదేశంలోని పలు రాష్ట్రాలు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఖర్చులను కూడా మాఫీ చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు కేంద్రం ప్రకటించిన రాయితీలకు అదనంగా మరిన్ని రాయితీలను కూడా భరిస్తున్నాయి.
ఎందుకని అన్న విషయం కేరళ పోలీసులకు తెలిసా.? తెలియదా.? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయం తెలియకుండానే ట్రాఫిక్ పోలీసులు ఉద్యోగాలు వెలగబెడుతున్నారా.? అని ప్రశ్నలు వినబడుతున్నాయి. ఎందకంటే.. వారు చేసిన నిర్వాకం అలాంటిది. ఓ ఎలక్ట్రిక్ వెహికల్‌కు పొల్యూషన్ సర్టిఫికెట్ పేరిట చలాన్ విధించారు. ప్రస్తుతం ఈ చలాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాలుష్య రహితంగా ఉండే విద్యుత్ వాహనాలకు కాలుష్య సర్టిఫికెట్ లేదంటూ కేరళ పోలీసులు వేసిన జరిమానా.. నెటిజనులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కేరళలోని మలప్పురం జిల్లాలోని నీలాన్చెరి ఏరియాలో ఓ ఎలక్ట్రిక్ టూ వీలర్‌కు ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించారు. ఎందుకంటే ఆ వెహికల్‌కు పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ లేదని చలాన్ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు గానూ రూ. 250 జరిమానా విధించారు. మోటార్ వెహికల్ చట్టం 1998లోని సెక్షన్ 213(5)(e) ప్రకారం చలాన్ జారీ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి నెటిజన్లు విజ్ఞప్తి చేశారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more