Queen spotted in clouds moments after death క్వీన్‌ ఎలిజబెత్‌ మ‌ర‌ణానంత‌రం… ఆకాశంలోని మేఘాల్లో అమె ప్రతిబింభం

Double rainbow appears over buckingham palace as crowd gathers to mourn queen

cloud formation queen, queen cloud, queen death, Golden colour clouds, Queen Elizabeth, Queen Elizabeth death, Queen Elizabeth ii, Queen, Queen Elizabeth cloud, Queen cloud, double rainbow, Double Rainbow Over Buckingham Palace, Westminster, Buckingham Palace, Royal Family, Balmoral, queen death, elizabeth ii death, queen elizabeth death, queen elizabeth ii death, queen elizabeth news, Britain, Queen Elizabeth II Health,Queen Of England, United Kingdom, Queen Elizabeth Latest News, UK News, Double Rainbow Over Buckingham Palace, viral news, trending news

Thousands of people have been moved to see a photograph taken hours after the Queen died yesterday, showing a cloud lit up by the sun in the shape of the monarch. Almost everyone in Britain knows the shape of the Queen’s profile, whether that is from sending letters with stamps, spending banknotes or just watching her public moments.

క్వీన్‌ ఎలిజబెత్‌ మ‌ర‌ణానంత‌రం… ఆకాశంలోని మేఘాల్లో అమె ప్రతిబింభం

Posted: 09/10/2022 03:55 PM IST
Double rainbow appears over buckingham palace as crowd gathers to mourn queen

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 మ‌ర‌ణానంత‌రం ఆ దేశంలో కొన్ని వింత సంఘటనలు జరిగాయి. పూర్వం ప్రజలకు సుపరిపాలన అందించిన రాజులు, సన్మార్గంలో పయనింపజేసిన మహర్షులు, తమ జీవాత్మను పరమాత్మలో విలీనం చేసే సమయంలోనే.. ఆకాశంలో పలు సానుకూల సంజ్ఞలు ఉత్పన్నమయ్యేవని పెద్దలు చెప్పిన మాటలు ఇప్పుడు బ్రిటన్ లో కనిపించడం అరుదైన విషయం. రాణి ఎలిజబెత్ మరణానంతరం కూడా బ్రిటన్ లో ఇలాంటి సంకేతాలు కనిపించాయని అక్కడి ప్రజలు మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా ఇందుకు సంబంధించిన వీడియోలను నెట్టింట్లో పోస్టు చేస్తోంది.

రాణి ఎలిజబెత్ 2 నివసించిన బకింగ్‌హామ్ ప్యాలెస్ మీదుగా ఆమె పరమపదించిన తరువాత రెండు ఇంద్రధనస్సులు కనిపించాయి. అలాగే ఒక నగరంపై ఆకాశంలో ఎలిజబెత్‌ రూపంలో, బంగారు వర్ణంలో ఉన్న మేఘం ఆకట్టుకుంది. 96 ఏళ్ల క్వీన్‌ ఎలిజబెత్‌, స్కాట్లాండ్‌లోని వేసవి విడిది నివాసంలో గురువారం కన్నుమూశారు. అధికారికంగా ఈ విషయం ప్రకటించిన కొన్ని నిమిషాల తర్వాత ష్రాప్‌షైర్‌లోని టెల్ఫోర్డ్ ప్రాంతంపై ఆకాశంలో బంగారు వర్ణంలో ఎలిజబెత్‌ను పోలిన మేఘం కనిపించింది. లిన్నేఅనే మహిళ కారులో వెళ్తుండగా ఆమె 11 ఏళ్ల కుమార్తె దీనిని గుర్తించింది.

అమ్మా.. ‘క్వీన్‌’ అని అరిచిన ఆ బాలిక ఎలిజబెత్‌ రూపంలో ఉన్న ఆ మేఘాన్ని తల్లికి చూపించింది. ‘ఓ మై గాడ్‌’ అంటూ ఆ చిన్నారి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీంతో కారును నిలిపిన ఆ మహిళ తన మొబైల్‌ ఫోన్‌లో ఫొటోలు తీసింది. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా, క్వీన్‌ ఎలిజబెత్‌ను పోలిన బంగారు వర్ణంలో ఉన్న మేఘం ఫొటో వైరల్‌ అయ్యింది. మరోవైపు శుక్రవారం క్వీన్‌ ఎలిజబెత్‌ అధికార నివాసమైన బకింగ్‌హామ్ ప్యాలెస్ మీదుగా ఆకాశంలో రెండు ఇంద్రధనస్సులు కనిపించాయి. లండన్‌ ప్రజలు ఈ వింతను చూశారు. ఆ ఇంద్రధనస్సుల మీదుగా తమ రాణి స్వర్గానికి వెళ్లినట్లు వారు భావించారు. జర్నలిస్ట్ జెన్నిఫర్ వాలెంటైన్ ట్వీట్ చేసిన ఈ ఫొటో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles