Tirumala Hundi Collection in the history of Tirumala in Aug 22 ఆగస్టులో తిరుమల శ్రీవారికి రికార్డుస్థాయిలో హుండీ ఆదాయం..

Tirumala temple receives highest ever monthly income of rs 140 34 crore in august

TTD Hundi colletons in August, August month TTD Hundi collections, Tirumala Srivaru Record Hundi collections, srivari Hundi collections in August, Tirumal srivari devotees Hundi collections, Tirumala Srivari Devotees Hundi offerings, TTD, TTD Hundi collections, Tirumala Srivaru, Record Hundi collections, Devotees, Hundi offerings,TTD EO, Chariman, YV Subbareddy, Devitional

The world renowned Lord Venkateswara temple received its highest ever Hundi income of Rs.140.34 crore in the month of August. Speaking to reporters TTD EO programme held at Tirumala on Saturday, EO AV Dharma Reddy said August's monthly Hundi income of Rs.140.34 crore is the highest ever income received by the temple body since its inception.

ఆగస్టులో తిరుమల శ్రీవారికి రికార్డుస్థాయిలో హుండీ ఆదాయం..

Posted: 09/10/2022 11:35 AM IST
Tirumala temple receives highest ever monthly income of rs 140 34 crore in august

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆగస్ట్‌ నెలలో తిరుమల శ్రీవారిని 22.22 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. టీటీడీ చరిత్రలోనే తొలిసారి ఒకే నెలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.140.34 కోట్లు వచ్చింది. ఇదే ఏడాది జూలైలో రూ.139.45 కోట్లు, మే నెలలో రూ.130.50కోట్ల ఆదాయం వచ్చింది. ఆగస్ట్‌ నెలలో 1.05 కోట్ల లడ్డూ విక్రయాలు జరిగాయి. మొత్తం 47.46 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. 10.85 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

కాగా, ఇవాళ తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వస్తున్న భక్తుల రద్దీ పెరిగింది. రెండో శనివారం, ఆదివారలతో కూడిన వారాంతం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి కొండపైకి చేరుకున్నారు. కొండ పై అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోగా రాంభగీచ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. వీరికి శ్రీవారి దర్శనం 24 గంటల్లో కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. కాగా నిన్న స్వామివారిని 64,292 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 30,641 మంది తలనీలాలు సమర్పించారని అధికారులు తెలిపారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా రూ. 3.72 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles