కేంద్ర ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. కేంద్ర విజిలెన్స్ (సివిసీ)లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఖాళీలను సకాలంలో భర్తీ చేయకపోవడం పట్ల కేంద్రప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం శ్రీముఖాలు జారీ చేసింది. తక్షణం సీవిసీలో ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ మేరకు నోటీసులు ఇచ్చింది. ‘కామన్ కాజ్’ అనే స్వచ్ఛంద సంస్థ.. ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ద్వారా దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటీషన్ ను ఇవాళ విచారించిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, అభయ్ ఎస్ ఓకాలతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. 17 జూలై, 2020 లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విజిలెన్స్ కమిషనర్ పోస్టును భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానించిందని, ఇప్పటి వరకు ఎలాంటి నియామకాలు జరుగలేదని పేర్కొంది. అలాగే జూన్ 2021లో ఏర్పడే ఖాళీలను అంచనా వేస్తూ.. మే 4, 2021న సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ పోస్టు భర్తీకి డీఓపీటీ దరఖాస్తులను ఆహ్వానించిందని, దరఖాస్తు చివరి జూన్ 7, 2020గా కూడా పేర్కోందని తెలిపింది. అయితే ఉద్యోగ ప్రకటనను వెలువరించి ఏడాది గడిచినా ఇప్పటికీ నియామకాలు మాత్రం జరగలేదని పేర్కోంది.
ఉద్యోగ ప్రకటన అనుగుణంగా ఇప్పటి వరకు ఎలాంటి అపాయింట్‌మెంట్ జరగలేదని పేర్కొంది. దీర్ఘకాలంగా ఉన్న ఖాళీలను సకాలంలో భర్తీ చేయడంలో కేంద్రం విఫలమైందని పిటిషనర్ ఆరోపించారు. కమిషనర్‌లను ఎక్కువ కాలం పాటు నియమించకపోవడం, పౌరుల సమాచార హక్కుకు భంగం కలిగించడమేనని పిటిషనర్ ఆరోపించారు. జూలై 2020, మే 2021లో జారీ చేసిన ప్రకటనల ప్రకారం విజిలెన్స్ కమిషనర్, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌లను నియమించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసి.. మూడువారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more