Have to pay Rs 224 with GST for urinating at the Railway station రైల్వే బాదుడు మామూలుగా ఉండదు.. టాయిలెట్ చార్జీ రూ.112

12 gst on peeing british tourists charged rs 224 by irctc for using toilet at agra railway station

rs 224 for using washroom, tourists paid rs 224, tourists paid rs 224 toilet, tourists paid rs 224 for washroom, tourists paid rs 224 for peeing, british tourists paid rs 224 irctc, passengers charged rs 224 for peeing, passengers charged rs 224 for using washroom, passengers charged rs 224 for toilet, irctc agra toilet rs 224, agra railway station tourists paid rs 224 toilet, rs 224 toilet irctc agra, rs 224 for toilet agra station, executive lounge, agra cantonment Railway Station, british embassy, new delhi, irctc, agra, British Nationals, toilet, GST, Uttar Pradesh

In a first, an incident has come to light where the GST was applied to the use of toilets in a country that is building toilets everywhere to promote the "Swachh Bharat Mission." The incident was reported from Agra where two British tourists were charged Rs. 112 each by IRCTC for using the washroom in the executive lounge of the Agra Cantt. railway station. Reportedly, the amount paid includes 6 percent GST and 6 percent CGST.

రైల్వే బాదుడు మామూలుగా ఉండదు.. టాయిలెట్ చార్జీ రూ.112

Posted: 09/06/2022 12:28 PM IST
12 gst on peeing british tourists charged rs 224 by irctc for using toilet at agra railway station

రైల్వేస్టేషన్‌ వద్ద వాహనాల పార్కింగ్ ఫీజు మాత్రమే జేబుల్ని గుల్ల చేస్తోందని మనకు తెలిసిన విషయమే. ఈ చార్జీలను తగ్గించాలని ఏకంగా రాష్ట్రమంత్రి కేటీఆర్ స్వయగా అప్పటి రైల్వే మంత్రిత్వశాఖకు, మంత్రికి కూడా ఉత్తరాలను రాశారు. సరిగ్గా అలాంటి ఘటనే కాకపోయినా.. రైల్వే తెరమాటు బాదుడు ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే.. ఈ ఘటన మరో ఉదాహరణగా నిలుస్తోంది. సాధారణంగా ఎవరైన రైల్వే స్టేషన్లో టాయ్‌లెట్‌ వాడుకుంటే ఎంత చెల్లిస్తాం? మహా అయితే ఐదు రూపాయలు.. కాకుంటే 10 రూపాయలు. అలా కాకుండా ఏకంగా విస్మయం గోలిపే ధరను వసూలు చేశారు.

ఔనా.. ఇంతకీ ఎంత వసూలు చేశారు. అంటే ఏకంగా రూ.112 వసూలు చేశారు. ఔనా అంటే ఇది ఎక్కడ జరిగిందీ.. అంటే ఏకంగా దేశరాజధాని ఢిల్లీకి అత్యంత చేరువలోని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ప్రపంచంలోని అద్భుత నిర్మాణమైన తాజ్ మహాల్ ను వీక్షించేందుకు వచ్చిన ఇద్దరు బ్రిటిష్ పర్యాటకులకు ఆగ్రా రైల్వేస్టేషన్ లో ఈ విస్మయ ఘటన ఎదురైంది. ఇద్దరు బ్రిటిష్‌ పర్యాటకులు టాయిలెట్ కు వెళ్లి ఏకంగా రూ.112 చొప్పున చెల్లించుకోవాల్సి వచ్చింది! వారిద్దరూ ఢిల్లీలోని బ్రిటిష్‌ ఎంబసీ నుంచి ఆగ్రా వెళ్లారు. రైల్వేస్టేషన్లో శ్రీవాత్సవ అనే గైడ్‌ వారిని రిసీవ్‌ చేసుకున్నాడు. టాయ్‌లెట్‌కు వెళ్లాలని చెప్పడంతో ఐఆర్‌సీటీసీ ఎగ్జిక్యూటివ్‌ లాంజ్‌కు తీసుకెళ్లాడు.

బయటికి రాగానే 12 శాతం జీఎస్టీతో కలిపి చెరో రూ.112 రూపాయలు చెల్లించాలని వారిని సిబ్బంది డిమాండ్‌ చేశారట. ఇదేమిటని ప్రశ్నించినా లాభం లేకపోయిందని, దాంతో ఆ మొత్తాన్ని తానే చెల్లించానని గైడ్‌ చెప్పుకొచ్చాడు. దీనిపై ఆయన ఐఆర్‌సీటీసీకి ఫిర్యాదు కూడా చేశాడు. అయితే అది లాంజ్‌ సేవల చార్జే తప్ప టాయ్‌లెట్‌కు వెళ్లినందుకు వసూలు చేసింది కాదని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది. ‘‘లాంజ్‌ సేవలు వాడుకుంటే కనీస చార్జీ రూ.200. రెండు గంటల పాటు ఏసీ లాంజ్‌ రూము, కాంప్లిమెంటరీ కాఫీ, ఉచిత వైఫై వంటి సదుపాయాలకు కలిపి ఈ చార్జీ.

లాంజ్ వినియోగించుకున్నది ఇద్దరు బ్రిటీష్ జాతీయులైనప్పటికీ వారికి 50 శాతం డిస్కౌంట్‌ కూడా కల్పించామని.. ఆ రాయితీ పోను 12 శాతం జీఎస్టీతో కలిపి ఒక్కోక్కరికి రూ.112 చెల్లించాల్సి ఉంటుంది’’ అని వివరించింది. దీంతో ఇద్దరికీ కలపి ఏకంగా రూ.224 వసూలు చేసింది ఐఆర్సీటీసీ. ఇక ఐఆర్సీటీసీ లీలల గురించి మాట్లాడటం మొదలు పెడితే అన్నీ ఇన్నీ కావు. ఇటీవల భోపాల్ శతాబ్ది రైలులో భోపాల్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న తరుణంలో ఒక వ్యక్తి కాసింత ఉపశమనం పొందేందుకు టీ ఆర్డర్ ఇచ్చాడు. దాని చార్జీ రూ.70 బిల్లును అతని చేతిలో పెట్టింది ఐఆర్సీటీసీ. ఇంతెందుకు అంటే.. సర్వీసు చార్జీ రూ.50. రూ.20 చాయ్ కి రూ.50 సర్వీసు చార్జీ వేసిన ఘనత మన ఐఆర్సీటీసీ తప్ప మరెవరికీ దక్కదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles