Actor Archana Gautam alleges misbehaviour by TTD employee టీటీడీ సిబ్బందిపై సినీ నటి అర్చన గౌతం సెల్ఫీ వీడియో

Uttar pradesh actress archana gautam posts videos of misconduct tirupati balaji temple

tirumala tirupathi devasthanam, TTD Board not inteviened, misconduct of TTD employee, srikant tiwari atchana gautam, archana gautam ruckus at Tirumal, andhra pradesh holy city Tirumala, uttar pradesh actress archana gautam, TTD Board, TTD employee, srikant tiwari, archana gautam, andhra pradesh, uttar pradesh actress, congress leader, Uttar Pradesh, Andhra Pradesh, Crime

A row broke out during actress Archana Gautam's visit to Tirumala temple as she alleged that a TTD employee misbehaved with her but TTD denied the allegation and claimed that she attacked its employee. Archana posted a selfie video of the incident on her Twitter account on Monday. As she was speaking about her grievance, somebody tried to stop her from recording and she was heard shouting and crying.

టీటీడీ సిబ్బందిపై సినీ నటి అర్చన గౌతం సెల్ఫీ వీడియో

Posted: 09/05/2022 09:15 PM IST
Uttar pradesh actress archana gautam posts videos of misconduct tirupati balaji temple

తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చిన తనను టీటీడీ సిబ్బంది దారుణంగా అవమానించారని ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సినీ నటి అర్చన గౌతం ఆరోపించారు. తన నుంచి డబ్బులు తీసుకుని కూడా తనకు టికెట్ కేటాయించలేదని అమె అరోపణలు చేశారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ఖాతా వేదికగా సెల్ఫీ వీడియోను సోమవారం పోస్టుచేశారు. తనకు టికెట్ ఎందుకు కేటాయించలేదని అడిగితే తనను అవమానించిన టీటీడీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. రూ. 10,500 పెట్టి టికెట్ కొన్నా కూడ తనకు టికెట్ ఇవ్వలేదని ఆమె ఆరోపించారు.

టికెట్ కోసం కౌంటర్ కు వెళ్తే తనపై దాడి చేశారని ఆమె ఆరోపించారు.  టీటీడీ సిబ్బంది తీరును ఆమె తప్పు బట్టారు.  ఈ ఘటనపై టీటీడీ  బోర్డుతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసకోవాలని ఆమె కోరారు.  టీటీడీ టికెట్ కౌంటర్ వద్ద జరిగిన పరిణామాలను ఆమె సెల్పీ వీడియోలో పేర్కొన్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.  సెల్ఫీ వీడియోలో సినీ నటి అర్చన గౌతం కన్నీళ్లు పెట్టుకుంటూ తనకు తిరుమలలో చోటు చేసుకున్న అనుభవాన్ని వివరించారు. ఆమె సెల్పీ వీడియో తీసుకుంటున్న సమయంలో టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

అయితే ఈ ఘటనపై టీటీడీ అధికారులు స్పందించారు. తమ సిబ్బంది నటిపై దాడి చేయడం అబద్ధమని టీటీడీ పేర్కొంది. ఈ మేరకు పూర్తి వివరాలతో టీటీడీ అధికారిక ట్విటర్‌ ఖాతాలో అధికారులు వివరణ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్‌ చేస్తూ.. టీటీడీ ఉద్యోగులపై నటి అర్చనా గౌతమ్‌ దాడి హేయమైన చర్య అని, అవాస్తవ ఆరోపణలతో ఉద్యోగులపైనే తప్పుడు ఫిర్యాదు చేయటాన్ని టీటీడీ ఖండిస్తు ఈ ఘటనకు సంబంధించి వరుస ట్వీట్లలో వివరణ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles