27 ఏళ్లుగా దేశంలో తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూ. ఒకటికాదు రెండు కాదు ఏకంగా ఐదువేల కార్లును చోరిచేసిన కరుడుగట్టిన నేరగాడి గురించి మీకు తెలుసా.? నేరాలకు పాల్పడటమే కాదు సార్ లో సరసశృంగార రసాలు కూడా ఎక్కువే. అందుకనే ఏకంగా ముగ్గురిని తన భార్యలుగా చేసుకుని, ఏడుగురు పిల్లల్ని కన్నాడు. ఇతగాడికి సంపన్నులకు ఉన్నట్లుగా ఏకంగా రెండు, మూడు రాష్ట్రాల్లో ఆస్తులున్నాయంటే అతిశయోక్తి కాదు. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? ఏ అండర్ వరల్డ్ డాన్ గురించో చెబుతున్నామని అనుకుంటున్నారా.?
దేశంలోనే కాకలు తీరిన కార్ల దొంగగా పేరొందిన అనిల్ చౌహాన్ అనే వ్యక్తి ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. 27 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా వారి కళ్లుగప్పి మొత్తం ఐదువేల కార్లను దొంగతనం చేసిన ఈ కరుడుగట్టిన కార్ల దొంగ ఆటను ఎలాగైన కట్టించాలని పూనుకున్న పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దొంగ అనిల్ చౌహాన్‌ను ఢిల్లీ స్పెషల్ స్ఠాఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అనిల్ నుంచి ఆరు తుపాకులు, ఏడు కాట్రిడ్జులను స్వాధీనం చేసుకున్నారు.. అయితే కార్ల చౌర్యానికి తిలోదకాలు ఇచ్చిన ఈ నేరగాడు.. తన పరపతిని పెంచుకుని ప్రస్తుతం ఏకంగా ఆయుధాల స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆటో రిక్షా డ్రైవరుగా జీవితం ప్రారంభించిన అనీల్ చౌహాన్ తన కుటుంబ పోషణ కోసం కార్ల దొంగగా మారాడు. అయితే పోలీసులకు చిక్కకుండా 27 ఏళ్లుగా తప్పించుకున్న ఇతగాడు.. ఇండియాస్ బిగ్గెస్ట్ కార్ థీఫ్ గా ఎదిగాడు. ఇతడ్ని ఎలాగైన పట్టుకోవాలన్న ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు సఫలం అయ్యారు. గత 27 ఏళ్ల కాలంలో అనిల్ మొత్తం ఐదువేల కార్లను దొంగలించారని పోలీసులు తెలిపారు. పక్కా సమాచారంతో దేశ్ బంధు గుప్తా రోడ్ ప్రాంతంలో నిందితుడ్ని ఢిల్లీ స్పెషల్ స్ఠాఫ్ సిబ్బంది అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఆయుధాలు సేకరించి, ఈశాన్య రాష్ట్రాల్లోని నిషేధిత సంస్థలకు చేరవేస్తున్నట్లు గుర్తించారు.
ఢిల్లీలోని ఖాన్పూర్ ప్రాంతంలో ఆటో రిక్షా నడుపుతూ జీవితం ప్రారంభించిన అనిల్ చౌహాన్...1995 తర్వాత కార్ల దొంగతనం ప్రారంభించాడు. ఎక్కువగా మారుతి 800 కార్లను చోరీ చేసేవాడు. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల్లో చోరీ చేసిన కార్లను నేపాల్, జమ్మూ కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలకు తరలించి విక్రయించేవాడు. వాహనాలను దొంగతనం చేసే సమయంలో అడ్డొస్తే కారు డ్రైవర్లను కూడా నిర్దాక్షిణ్యంగా అనిల్ హతమార్చేవాడని పోలీసులు వివరించారు. తర్వాత కొన్ని రోజులకు అసోంకి మకాం మార్చిన అనిల్.... అక్కడ ప్రభుత్వ కాంట్రాక్టర్ అవతారమెత్తాడు. స్థానిక నేతలతో పరిచయాలు పెంచుకుని పెద్ద మనిషిగా చెలామణి అయ్యాడని పోలీసులు చెప్పారు.
అనిల్ చౌహన్‌కు ముగ్గురు భార్యలు, ఏడుగురు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తన అక్రమ సంపాదనతో ఢిల్లీ, ముంబయి, ఈశాన్య రాష్ట్రాలలో పెద్దఎత్తున ఆస్తులను కూడబెట్టినట్లు తెలిపారు..ఇన్నేళ్ల కాలంలో అనిల్ అనేక సార్లు పోలీసులకు పట్టుబడ్డాడు.2015లో ఓసారి పోలీసులకు దొరికిన తర్వాత ఐదేళ్ల పాటు జైళ్లో ఉన్నాడు. 2020లో విడుదలయ్యాడు. ఇప్పటి వరకూ దేశంలోని పలు రాష్ట్రాల్లో నిందితుడు అనిల్ చౌహాన్‌పై 180కి పైగా కేసులు నమోదయ్యాయి. అనిల్ చౌహాన్‌పై ఈడీ సైతం మనీలాండరింగ్ కేసు నమోదు చేయడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more