Cashier laundered Rs 5 crore in cash fraud at SBI రూ.5.2 కోట్ల స్కామ్ కు పాల్పడిన ఎస్బీఐ బ్యాంకు క్యాషీయర్

Sbi cashier booked by cbi for rs 5 2 crore theft from bank atms

Central Bureau of Investigation (CBI), State Bank of India, Narsapur Branch Cashier, CCTV footage, SBI Siddipet AGM P.Satya, SBI Narsapur branch cashier, cashier A Nagender, ATM Theft, Gold ornaments, Nagender, sbi cashier, SBI, AGM Satya, CCTV footage, narsapur sbi bank, narsapur, strong room, cbi, Siddipet, Telangana, Crime

CBI has booked SBI, Narsapur, staff for allegedly siphoning off Rs 5.2 crore from ATMs, cash and gold ornaments in the bank. The accused reportedly operated the bank's strong room alone contrary to rules. Officials nailed the accused with the help of CCTV footage. CBI booked a case on the accused based on the complaint lodged by SBI (Siddipet) AGM P Satya, under releavant sections on cashier-in-charge A Nagender and others.

కంచె చేనుమేసింది: రూ.5.2 కోట్ల స్కామ్ కు పాల్పడిన ఎస్బీఐ బ్యాంకు క్యాషీయర్

Posted: 09/05/2022 05:32 PM IST
Sbi cashier booked by cbi for rs 5 2 crore theft from bank atms

కంచె చేను మేసిన చందంగా తిన్న ఇంటి వాసలు లెక్కిపెట్టిన ఓ ఎస్బీఐ సీనియర్ ఉద్యోగిపై సీబిఐ కేసు నమోదు చేసింది. ఎస్బీఐ‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న సదరు సీనియర్ ఉద్యోగి ఆ బ్యాంక్ శాఖ నుంచి ఏకంగా రూ. 5.23 కోట్ల విలువైన నగదు, నగలు స్వాహా చేశాడు. స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి రూ.2.2 కోట్ల నగదును, రూ.70 లక్షల విలువైన బంగారం తస్కరించాడు. 3 ఏటీఎంల నుంచి రూ. 2.3 కోట్ల నగదు చోరీ చేశాడు. ఎస్‌బీఐ నర్సాపూర్ బ్రాంచ్‌లో ఈ చోరీ జరిగింది. ఎస్బీఐ సిద్దిపేట అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పి. సత్య ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్‌గా పనిచేస్తున్న ఎ.నరేంద్ర అనే సీనియర్ ఉద్యోగి ఆ బ్యాంక్ నుంచి రూ.5.23 కోట్ల విలువైన నగదు, సొత్తు స్వాహా చేశాడు. స్ట్రాంగ్‌ రూమ్‌ నుంచి రూ.2.2 కోట్ల నగదును, రూ.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలను తస్కరించాడు. మూడు ఏటీఎంల నుంచి రూ.2.3 కోట్ల నగదు చోరీ చేశాడు. బ్యాంకుకు మొత్తం రూ.5.23 కోట్ల నష్టం కలిగించినట్లు అధికారులు గుర్తించారు. ఎస్బీఐ నర్సాపూర్ బ్రాంచ్‌లో జరిగిన ఈ చోరీని ప్రాథమికంగా పరిశీలించిన బ్యాంకు ఉన్నతాధికారులు.. ఆ బ్యాంకులోని ఉద్యోగిపైనే అనుమానం వ్యక్తం చేశారు. ఎస్బీఐ సిద్దిపేట అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పి. సత్య ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

నర్సాపూర్ బ్రాంచ్ సీనియర్ అసోసియేట్, క్యాషియర్-ఇన్‌చార్జ్ ఎ నాగేందర్ సహా మరో ముగ్గురు సిబ్బందిపై శనివారం (సెప్టెంబర్ 3) కేసు నమోదు చేశారు. చీటింగ్, నేరపూరిత కుట్ర, నేరపూరిత విశ్వాస ఉల్లంఘన సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదు చేసి విచారిస్తోంది.నిందితుడు బ్యాంకు స్ట్రాంగ్‌ రూమ్‌ను నిబంధనలకు విరుద్ధంగా ఒంటరిగా నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ సాయంతో బ్యాంక్ అధికారులు నిందితులను గుర్తించారు. అయితే, అప్పటికే జాప్యం జరిగింది. బ్యాంక్ శాఖకు భారీ నష్టం జరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ ఏడాది జూన్ 21న సీనియర్ అసోసియేట్ నాగేందర్ కార్యాలయానికి రాలేదు.

నాటి బ్రాంచ్ మేనేజర్ ఫోన్‌లో సంప్రదించగా, బంధువు ఒకరు చనిపోయారని, అరగంట ఆలస్యంగా విధులకు హాజరవుతానని తెలిపారు. సాయంత్రం 4.00 గంటల వరకు కూడా రిపోర్ట్ చేయకపోవడం, ఆయన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో ఆందోళన చెందిన బ్రాంచ్ సిబ్బంది, ఆయన ఇంటికి వెళ్లారు. కానీ, అక్కడ ఆయన అందుబాటులో లేరని, ఆయన ఎక్కడికి వెళ్లారనే వివరాలు కూడా తెలియలేదని ఎస్‌బీఐ అధికారులు తెలిపారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో, బ్యాంక్ కస్టమర్ ఒకరు తాళం చెవిని తీసుకొచ్చి బ్యాంక్ ఔట్‌ సోర్సింగ్ సిబ్బందికి ఇచ్చి వెళ్లిపోయాడని.. ఆమె ఆ తాళంచెవిలను బ్రాంచ్ మేనేజర్‌కి అందజేశారని అధికారులు తెలిపారు.

అనంతరం బ్యాంక్ సిబ్బంది సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్, ఇతర ర్యాక్‌లను తనిఖీ చేయగా.. 2.32 కోట్ల నగదు, 72 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మాయమైనట్లు తేలింది. మూడు ఏటీఎంలను పరిశీలించగా 2.19 కోట్ల కొరత ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటివరకు బ్యాంకు శాఖకు 5.23 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ‘స్ట్రాంగ్ రూమ్/ఏటీఎమ్‌ల ఉమ్మడి ఆపరేషన్‌కు సంబంధించి బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా స్ట్రాంగ్ రూమ్‌ను నాగేందర్ ఒంటరిగా నిర్వహించినట్లు సీసీ ఫుటీజేల ద్వారా గుర్తించామని.. కాగా అతడి వెనుక ఇంకా ఎవరి హస్తం ఉందనేది తేలాల్సి ఉంది. అంతర్గత దర్యాప్తు కూడా జరుగుతోంది’ అని బ్యాంక్ అధికారి ఒకరు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagender  sbi cashier  SBI  AGM Satya  CCTV footage  narsapur sbi bank  narsapur  strong room  cbi  Siddipet  Telangana  Crime  

Other Articles