తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో సంభ్రమాశ్చర్యకర దృశ్యం కనువిందు చేసింది. అరుదైన దృశ్యాలు మెరుపు వేగంతో సంభవించి అదృశ్యమైవుతుంటాయి. కానీ ఇక్కడ అవిష్కృతమైన దృశ్యం ఏకంగా మూడు నిమిషాల పాటు కొనసాగింది. స్థానికులు ఈ అసక్తికర దృశ్యాలను తమ స్మార్ట్ ఫోన్లలో బంధించుకునేంత వరకు చోటుచేసుకుంది. ఈ దృశ్యం చూడటానికి అచ్చంగా అగ్రరాజ్యంలో సంభవించే టోర్నడో తరహాలోనే ఉందని స్థానికులు చెబుతున్నా.. అసలు జరిగిన విషయం మాత్రం వేరే. ఏం జరిగిందనేగా.. భూమి మీద వున్న జలాశయాలు, చెరువులు, బావులు, కాలువలు, వాగులు, వంకలు.. చివరికి జీవనాధారమైన నదులు నిండాలన్నా వరుణ దేవుడి కృపాకటాక్షాలు కావాల్సిందే.
వరుణుడు ఒక్క ఏడాదికి కావాల్సినంత వర్షం కురిపిస్తే తప్ప.. భూమిపై సకలజీవరాశులకు ఉపశమనం లేదు. ఎందుకంటే నీరు లేకుండా ఏ ప్రాణి మనుగడైనా కష్టసాధమే. తండ్రి లాంటి వరుణ దేవుడికి జలాశయాలు పిలల్లు లాంటివే. అయితే తండ్రి బాధ్యతగా పిల్లలను ఎలా పాలన చేస్తోడో.. అదే విధంగా ఒక్కో సారి పిల్లలు కూడా తండ్రుల పట్ల అంతే ప్రేమ, ఆప్యాయలతో వ్యవహరించడం సాధారణ విషయమే. అయితే ప్రకృతి పరంగా ఈ ప్రేమాప్యాయత దృశ్యాలు స్మార్ట్ ఫోన్లకు చిక్కడం అరుదైన విషయం. సంగారెడ్డిలో జరిగిన విచిత్రమైన దృశ్యం ఏమంటే.. ఏకంగా వరుణ దేవుడికే మంజీరా నది నీళ్లు తాగించింది. టోర్నోడా భావించినా.. ఇది వాటర్ స్పౌట్ అని.. ఇది ఏర్పడటంతో నదిలోని నీళ్లు మేఘాలకు చేరాయి.
అయితే టోర్నోడో అత్యంత భయానకం. చెట్లు, పుట్టులు, ఇళ్లు కట్టడాలు అన్న తేడా లేకుండా ఏకంగా అన్నింటినీ పీకి పందిరేస్తుంది. కానీ వాటర్ స్పౌట్ మాత్రం అలాకాకుండా కేవలం కొన్ని నిమిషాల పాటు నీళ్లును తీసుకుని ఎలాంటి నష్టం లేకుండా అదృశ్యమైంది. టోర్నోడో వార్తల నేపథ్యంలో హడలెత్తిపోయిన స్థానికులు.. వాటర్ స్పౌట్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన వట్పల్లి మండలం సింగూరు జలాశయంలో చోటు చేసుకుంది. దేవునూర్, నిర్జప్లా గ్రామాల మధ్య సింగూర్ నీటిలో టోర్నడో ఏర్పడింది. ఆకాశానికి భూమికి మధ్య సుడిగుండంలా నీళ్లు సుడులు తిరుగుతూ మేఘాల్లోకి వెళ్లాయి. ఈ ఘటనతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more