sweeper with lakhs refused to use the money for treatment లక్షలు కూడబెట్టినా.. అనుభవించే ప్రాప్తం లేకుండానే..

Hospital sweeper in prayagraj died as rich man money not withdrawn from salary

Live poor, Die rich, millionaire sweeper, millionaire dheeraj, millionaire beggar, millionaire lives as poor, dheeraj, tuberculosis, money, Hospital, sweeper, Tuberculosis hospital, Treatment, marriage, BJP govt, prayagraj, uttar pradesh, Politics

In a bizarre case, a man who worked as a sweeper in a local hospital saved all his salary and ended up becoming a ‘millionaire’. He was afflicted with tuberculosis and yet he refused to use his money to get himself treated. As a result, the man lived out the adage “Live poor, Die rich”.

బిక్షాటన చేసి లక్షలు కూడబెట్టినా.. అనుభవించే ప్రాప్తం లేకుండానే..

Posted: 09/05/2022 04:19 PM IST
Hospital sweeper in prayagraj died as rich man money not withdrawn from salary

జివ్హకో రుచి.. పుర్రెకో బుద్ది అంటారు పెద్దలు. ఈ మాట ముమ్మాటికీ నిజం. మన మధ్యలో ఉన్న ఎంతోమందిని గమనిస్తే ఒక్కోక్కరిదీ ఒక్కో విధానం. కొందరు జేబులో చిల్లి గవ్వ లేకపోయాని.. డాబులకు పోతారు. అప్పులు చేసి మరీ ఆర్భాటాలకు పోతారు. కానీ మరికోందరు మాత్రం ఎన్ని డబ్బులు ఉన్నా.. తమ వద్ద ఏమీ లేదన్నట్లుగానే ఉంటారు. ఇక ఇంకోందరు మాత్రం బ్యాంకుల్లో డబ్బులు మూలుగుతున్నా.. దానిని అనుభవించకుండా.. బిక్షాటన చేస్తూనే ఉంటారు. దానితోనే జీవనాన్ని సాగిస్తుంటారు. ఇదే కోవకు చెందిన ఓ వ్యక్తి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని కన్నుమూశారు.

స్వీపర్ ఉద్యోగం చేసి పదేళ్లుగా తన బ్యాంకు ఖాతాలో పడిన జీతం నుంచి ఒక్క పైసా కూడా తీయని ఆయన.. భిక్షాటనతో వచ్చిన డబ్బుతోనే కాలం గడిపేశాడు. అతని మరణించిన తరువాత విచారణంలో సదరు స్వీపర్ ఖాతాలో కళ్లు చెదిరేంత డబ్బు ఉందని పోలీసులు తెలుసుకున్నారు. ఇక ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగరాజ్‌కు చెందిన ధీరజ్ కుష్టు వ్యాధి ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేసేవాడు. ఆ ఉద్యోగం అతని తండ్రి మరణాంతరం పొందాడు. అయితే ధీరజ్ తన జీతం డబ్బును బ్యాంక్‌ నుంచి తీసుకోలేదు. పదేళ్ల నుంచి పైసా కూడా తీసుకోలేదు. తన అవసరాలకు భిక్షాటన చేసుకునేవాడు.

తద్వారా వచ్చిన ఆ డబ్బుతో జీవనాన్ని గడిపేశాడు. ప్రతి ఏటా ఐటీ రిటర్న్స్‌ ఫైల్ చేసేవాడు. అయితే ధీరజ్ అనూహ్యంగా ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు ఆయన అకౌంట్‌లో రూ.70 లక్షలు ఉంది. విచిత్రం ఏమిటంటే ధీరజ్ తండ్రి కూడా ఇలాగే చేశాడు. తన జీతం డబ్బును వాడకుండా.. రోడ్డుపై భిక్షాటన చేసుకుంటూ జీవించాడు. ధీరజ్ కూడా అదే కొనసాగించాడు. అందరూ ఇచ్చిన డబ్బుతో, 80 ఏళ్ల తన తల్లికి వచ్చిన పెన్షన్‌ డబ్బులతో ఇద్దరు బతికేశారు. ప్రతి నెలా వచ్చిన జీతం డబ్బును ఖాతా నుంచి తీయకపోవడంతో.. అవి ఏకంగా లక్షలాది రూపాయలు అయ్యాయి. ఆ డబ్బు గురించి కొన్ని నెలల కిందట ఐటీ అధికారులు ధీరజ్‌ని ప్రశ్నించారు.

ధీరజ్ చెప్పిన సమాధానంతో వారు వదిలేశారు. అప్పుడే ధీరజ్ వార్తల్లో నిలిచాడు. జీతంలో పైసా కూడా తీయని వ్యక్తిగా హాట్‌టాపిక్ అయ్యాడు. ఇంకా విచిత్రమేమిటంటే.. తన దగ్గర డబ్బు గురించి తెలిస్తే తన భార్య వాటితో పారిపోతుందేమోననే అనుమానంతో ధీరజ్ పెళ్లి కూడా చేసుకోలేదు. తల్లితో మాత్రమే ఉంటున్నాడు. దురదృష్టవశాత్తు ధీరజ్ క్షయ వ్యాధితో బాధపడుతూ ఆదివారం చనిపోయాడు. ధీరజ్‌ చనిపోయాక బ్యాంకు ఖాతాలో రూ.70 లక్షలు ఉన్నట్లు తెలిసిందని అతడి స్నేహితుడు వెల్లడించాడు. ఇది తెలిసినవారంతా.. లక్షలు కూడబెట్టినా ఏ ప్రయోజనం అనుభవించకుండానే పోయాడనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles