6.6-magnitude earthquake hits China చైనాలో భారీ భూకంపం.. రెక్టార్ స్కేలుపై 6.8 తీవ్రత..

6 6 magnitude earthquake hits china s southwestern sichuan province 21 dead

china earthquake, 6.8-magnitude, Luding County, sichuan, Chengdu, southwest Sichuan province, earthquake today, china, china news

At least 21 people were killed in China on Monday when a powerful earthquake of 6.8-magnitude jolted Luding County in the country's southwest Sichuan province. The epicentre of the quake, which occurred at 12:25 pm local time, was monitored at 29.59 degrees north latitude and 102.08 degrees east longitude at a depth of 16 km, China Earthquake Networks Centre was quoted as saying by the state-run Xinhua news agency.

చైనా సిచువాన్‌ లో భారీ భూకంపం.. రెక్టార్ స్కేలుపై 6.8 తీవ్రత.. భారీ ప్రాణ, ఆస్తి నష్టం

Posted: 09/05/2022 02:57 PM IST
6 6 magnitude earthquake hits china s southwestern sichuan province 21 dead

చైనాలో భూమి తీవ్రంగా కంపించింది. నైరుతి చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌లోని లుండింగ్‌ కౌంటిలో సోమవారం భారీభూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.25 గంటలకు రిక్టర్‌ స్కేల్‌పై 6.8 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయని అధికారులు తెలిపారు. హిందూకుష్‌ పర్వతాల్లో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉత్తర పాక్‌లోని పలుచోట్ల సైతం భూమి కంపించింది. భారీ భూకంపం కారణంగా పలుచోట్ల భవనాలు శిధిలావస్థకు చేరాయి. కాగా పలు పర్వతప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి.. టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతింది.

ఇప్పటి వరకూ 21 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని ఆ దేశ అధికారులు తెలిపారు. భూకంపం సంభవించినట్టు చైనా భూకంప నమోదు కేంద్రాన్ని ఉటంకిస్తూ ఆ దేశ అధికారిక న్యూస్ ఏజెన్సీ సీసీటీవీ వెల్లడించింది. సిచువాన్ రాజధాని చెంగ్డూకు నైరుతిగా 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించిన్నట్టు పేర్కొంది. భూకంపం కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణ నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సిచువాన్ ప్రావిన్సుల్లోని పలు పట్టణాల్లో కొండచరియలు విరిగిపడి ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

10వేలకుపైగా ఇళ్ల పాక్షికంగా దెబ్బతినగా, దాదాపుగా వెయికి పైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలుస్తోంది. ఇక సిచువాన్ ప్రాంతంలో టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా భారీగా దెబ్బతినింది. దీంతో ప్రభావిత ప్రాంతంతో చైనాకు దాదాపుగా సమాచారం లేకుండాపోయింది. రాజధాని చెంగ్డు, దానికి సమీపంలోని చాంగ్వింగ్ మెగాసిటీలో పలు భవంతులు కొద్ది సెకన్లు కంపించినట్టు స్థానికులు తెలిపారు. గరేజ్, యాన్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సహాయక చర్యల కోసం 500మందికి పైగా సిబ్బంది రంగంలోకి దిగాయి.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పటికే చెంగ్డూ నగరంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా.. గోరుజుట్టుపై రోకటిపోటు అన్నట్లు భూకంపం తర్వాత ఇళ్ల నుంచి బయటకు వచ్చినా తమ కాంపాడ్లకే పరిమితమయ్యారు. గత శుక్రవారమే చెంగ్డూలో లాక్‌డౌన్ ప్రకటించారు. ఈ భూకంపానికి ముందు తూర్పు టిబెట్‌లో 4.6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. టిబెట్‌కు ఆనుకుని ఉన్న సిచువాన్ ప్రావిన్సులో తరచూ భూపంకంపాలు సంభవిస్తాయి. జూన్‌లోనూ 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. 2013 తర్వాత తీవ్ర భూకంపం రావడం ఇదే మొదటిసారి.

అయితే భూకంపం కారణంగా భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తున్నా.. ఇప్పటికీ ఎలాంటి అంచనాలు మాత్రం అధికారులు వెల్లడించలేదు. కాగా, భూకంపం కారణంగా మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. టిబెట్‌ను ఆనుకొని ఉన్న సిచువాన్‌ ప్రావిన్స్‌లో భూకంపాలు ఎక్కువగా వస్తుంటాయి. టిబెటన్ పీఠభూమిలోనూ తరచూ భూకంపాలు నమోదవుతూ ఉంటాయి. అయితే, 2008లో సిచువాన్ ప్రావిన్సుల్లో రిక్టర్ స్కేల్‌పై 8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి వేలాది మందిని పొట్టనబెట్టుకుంది. ఏకంగా 70 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. టిబెట్ పీఠభూమి, సిచువాన్ ప్రావిన్సులు భూకంపాల జోన్‌లో ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles