Vande Bharat Train Hits 180 kmph Mark During Trials గంటకు 180 కీమీ వేగంతో దూసుకెళ్లిన వందేభార‌త్ రైలు..

Glass filled with water stays stable at 180 kmph on vande bharat train

vande bharat video, ashwini vaishnav,vande bharat express train speed, vande bharat route, ashwini vaishnav twitter, indian railways, indian government, vande bharat express, kota division, ashwani vaishnaw, kurlasi, Vande Bharat Express, Vande Bharat train, Vande Bharat train speed, indian Railways

Ashwini Vaishnav, the Minister of Railways shared an interesting video that shows the Vande Bharat Express train number two running at a speed of 180 kilometres per hour. Notably, the one minute long video has two elements- a glass filled to the brim with water and a cellular device that shows the speed at which the train is moving.

ITEMVIDEOS: 180 కీమీ వేగంతో దూసుకెళ్లిన వందేభార‌త్ రైలు.. గ్లాసులో నీళ్లు తొణకకుండా..

Posted: 08/27/2022 04:20 PM IST
Glass filled with water stays stable at 180 kmph on vande bharat train

వందేభారత్ రైలు దేశంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లేలా రూపోందుతున్న రైలు. కాగా ఈ రైలు వేగంలో తాజాగా జరిపిన ట్రయల్స్ లో మరో రికార్డు క్రియేట్ చేసింది. ట్ర‌య‌ల్ ర‌న్‌లో ఆ రైలు గంట‌కు 180 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకువెళ్లింది. వందేభారత్ రైలుకు టెస్ట్ ర‌న్ నిర్వ‌హించారు. ఈ విష‌యాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. కోటా-నాగ్డా సెక్ష‌న్ మ‌ద్య రైలు వేగాన్ని ప‌రీక్షించారు. టెస్ట్ ర‌న్ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో రైలులో వాషింగ్‌, క్లీనింగ్‌తో పాటు అన్ని ప‌రిక‌రాల ప‌నితీరును ప‌రిశీలించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. కోటా-నాగ్డా రూట్లో రైలు స్పీడ్ లెవ‌ల్స్‌ను టెస్ట్ చేసిన‌ట్లు మంత్రి తెలిపారు. 16 కోచ్‌ల‌తో వందేభార‌త్ రైలును ప‌రీక్షించారు.

కోటా డివిజ‌న్‌లో వివిధ ద‌శ‌ల్లో ట్ర‌య‌ల్స్ చేప‌ట్టారు. కోటా నుంచి ఘాట్ కా బ‌రానా మ‌ధ్య మొద‌టి ద‌శ ట్ర‌య‌ల్‌, ఘాట్ కా బ‌రానా నుంచి కోటా మ‌ధ్య రెండో ద‌శ ట్ర‌య‌ల్‌, కుర్లాసీ నుంచి రామ్‌గంజ్ మ‌ధ్య మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్‌, నాలుగ‌వ‌-అయిద‌వ ద‌శ ట్ర‌య‌ల్ కూడా ఈ స్టేష‌న్ల మ‌ద్య డౌన్‌లైన్‌లో చేప‌ట్టారు. ట్ర‌య‌ల్ ర‌న్ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో అనేక ప్ర‌దేశాల్లో రైలు గంట‌కు 180 కిలోమీట‌ర్ల వేగాన్ని ట‌చ్ చేసిన‌ట్లు మంత్రి తెలిపారు. వందేభార‌త్ రైలును పూర్తిగా ఇండియాలోనే త‌యారీ చేస్తున్నారు. దీన్ని సెమీ హై స్పీడ్ ట్రైన్‌గా పిలుస్తున్నారు. వందేభార‌త్‌కు ప్ర‌త్యేక ఇంజిన్ ఉండ‌దు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles