No permission for employees' Chalo Vijayawada సెప్టెంబర్‌ 1 న ‘ఛలో విజయవాడ’.. ఉద్యోగ సంఘాల పిలుపు..

Employees chalo vijayawada call over withdrawl of cps amid strict police checks

Andhra Pradesh Employees, AP Employees chalo vijayawada, CM House Gherao, YS Jagan house Gherao, Employees Sep 1 chalo vijayawada, govt vs employees, Contibutory Pension Scheme, CPS Talks, AP Government, YSRCP govt, Andhra Pradesh, Politics

Police conducted checking on lodges and hotels at different places in Vijayawada and on the city outskirts on Friday night. The checking continued on Saturday, to prevent the stay of employees, who were protesting against the Contributory Pension Scheme (CPS). Leaders of the Employees Associations gave ‘Chalo Vijayawada’ call on September 1, demanding the withdrawal of CPS and implementation of Old Pension Scheme (OPS).

సీపీఎస్‌ చర్చలు విఫలం: సెప్టెంబర్‌ 1 న ‘ఛలో విజయవాడ’లోనే తేల్చుకుందాం..

Posted: 08/27/2022 05:11 PM IST
Employees chalo vijayawada call over withdrawl of cps amid strict police checks

కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సాగిస్తున్న పోరాటం రాష్ట్రంలో ఉద్రిక్తతకు దారితీస్తుందా.? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. సీపీఎస్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఉద్యోగులు సాగిస్తున్న పోరాటం మరో కీలక ఘట్టానికి చేరింది. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య జరిగిన చర్చలు ఎలాంటి పరిష్కారం కనుగొనకుండానే ముగిసిపోవడంతో.. ఉధ్యోగ సంఘాలు సెప్టెంబర్ 1న ఛలో విజయవాడ పిలుపుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసం ముట్టడికి పిలుపునిచ్చాయి.

ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు ఉద్యోగ సంఘాలనేతలు నిర్ణయించారు. ఈమేరకు సెప్టెంర్‌ 1 న ‘ఛలో విజయవాడ’కు అసోసియేషన్ నేతలు పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని తమ దరికి తెచ్చుకుని డిమాండ్లు సాధించుకోవాలంటే పోరాటం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. మరో దఫా చర్చలకు సిద్ధం కావాలని మంత్రులు సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నేతలకు సూచించారు. అయితే, మరో ధఫా చర్చలు ఎప్పుడనేది వారు స్పష్టం చేయకపోవడం విశేషం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దుపై ఉద్యోగుల సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలంగా ముగిశాయి.

మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డిలతో సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నేతలు సమావేశమై సీపీఎస్‌పై చర్చించారు. సీపీఎస్‌ రద్దుకు తమకు అభ్యంతరం లేదని, దాని స్థానంలో జీపీఎస్‌ (గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీం‌) ను ప్రవేశపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రులు చెప్పడంతో ఉద్యోగుల సంఘం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రుల ప్రతిపాదనలను యూనియన్ తిరస్కరించింది. సీపీఎస్‌ రద్దుపై ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ నేతలు మంత్రులను ప్రశ్నించారు. బేషరతుగా సీపీఎస్‌ను రద్దు చేయాలని యూనియన్‌ నేతలు మంత్రులకు విజ్ఞప్తి చేశారు.

ఇలాఉండగా, ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సెప్టెంబర్‌ 1 న ఛలో విజయవాడకు ఎంప్లాయిస్‌ యూనియన్‌ పిలుపునిచ్చింది. చర్చల అనంతరం అసోసియేషన్ నాయకులు మీడియాతో మాట్లాడారు. సీపీఎస్‌పై చర్చలు విఫలమవడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే సీపీఎస్‌ రద్దు కావడం లేదని వారు విచారం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 1 న ఛలో విజయవాడతోపాటు ఛలో సీఎం క్యాంపు కార్యాలయం కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తామని హెచ్చరించారు. కాగా, సెప్టెంబర్‌ 1న చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని విరమించుకోవాలని మంత్రులు అసోసియేషన్‌ నేతలకు విజ్ఞప్తి చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles