Massive 15-feet long sinkhole forms on Noida Expressway నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేకు పగుళ్లు… రోడ్డు మధ్యలో పెద్ద గొయ్యి

Huge sinkhole on noida greater noida expressway underpass being made below

Noida Expressway Caves In, Noida Greater Noida Expressway Caves In, Noida News, Noida Greater Noida Expressway Sinkhole, Sinkhole Noida Greater Noida Expressway, noida, greater noida, greater noida expressway, sinkhole, noida sinkhole, viral video, road cave in, Uttar Pradesh News

A 15-foot-long and two-foot-wide portion of the Noida-Greater Noida Expressway caved in resulting in a huge sinkhole, prompting officials to launch immediate repair work on it. According to police officials, there was a massive traffic congestion due to the incident on Friday but the movement of vehicles was normal this morning.

ITEMVIDEOS: నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేకు పగుళ్లు… వేగంగా వస్తే అంతే సంగతులు..

Posted: 08/27/2022 03:32 PM IST
Huge sinkhole on noida greater noida expressway underpass being made below

ఉత్తర ప్రదేశ్‌లోని ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా జాతికి అంకితమిచ్చిన బుంధేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ హైవేపై చిన్నపాటి వర్షాలతో గొతులు ఏర్పడి కంకర తేలడంతో.. దాని నాణ్యతపై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. రోడ్డు నాణ్యత విషయంలో లోపభూయిష్టంపై ఈడీ చేత దర్యాప్తు చేయించాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. కాంట్రాక్టుపై ఆదాయ పన్ను శాఖ చేత దాడులు చేయించాలని ఇలా పలు రకాల విమర్శలు వినిపించాయి. అయితే ఈ రోడ్డు అంశాన్ని ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న తరుణంలో అదే ఉత్తర్ ప్రదేశ్ లోని మరో రోడ్డు ఈ అంశాన్ని మళ్లీ గుర్తుచేసింది.

అయితే తాజాగా నోయిడా నుంచి గ్రేటర్ నోయిడా మధ్య నిర్మించిన నోయిడా ఎక్స్‌ప్రెస్‌-వే పగుళ్లించింది. పదిహేను మీటర్ల పొడవు, రెండు అడుగుల వెడల్పు మేర పెద్ద గొయ్యి ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించింది. దీంతో స్థానికులు, వాహన యజమానులు తీవ్ర ఆందోళన చెందారు. ప్రతినిత్యం అత్యంత రద్దీగా ఉండే ఈ రహదారి.. ఇవాళ శనివారం కావడంతో కాసింత రద్దీ తక్కువగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ ను అధికారులు త్వరితగతిన క్లియర్ చేయగలిగారు. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ రహదారిశాఖ అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగి.. ఆ మార్గంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అవాంతరం లేకుండా మరమ్మతులు చేశారు.  

అయితే నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వేపై తవ్వకం పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సెక్టార్‌ 96 వద్ద అండర్‌ పాస్‌ కోసం పనులు జరుగుతున్నాయని చెప్పారు. శుక్రవారం పనులు మొదలయ్యాయని, దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడిందని వివరించారు. కాగా, 27 కిలోమీటర్ల పొడవైన నోయిడా-గ్రేటర్‌ నోయిడా ఎక్స్‌ప్రెస్‌ వే మీదుగా లక్షల్లో వాహనాలు ప్రయాణిస్తుంటాయి. సెలవు రోజులైన శనివారం, ఆదివారం ఈ మార్గంలో ట్రాఫిక్‌ తక్కువగా ఉంటుంది. మరోవైపు అండర్‌ పాస్‌ పనుల వల్ల ఆ ఎక్స్‌ప్రెస్‌ వేపై ట్రాఫిక్‌ జామ్‌లు, అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. అయితే శనివారం పరిస్థితి మెరుగుపడిందని, ట్రాఫిక్‌ జామ్‌ తగ్గిందని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles