Communal tensions in Gujarat after cops nab murder accused ప్రధాని మోదీ స్వరాష్ట్ర పర్యటన.. గుజరాత్ లో మతఘర్షణలు..

Communal clashes erupt in bhuj after man stabbed to death

Communal tension eases at Kutch village, Kutch Village, cops nab murder accused in gujarat, heavy security in kutch, latest updates, Communal tension in gujarat eases, kutch news, kutch, Gujarat, crime

Police have nabbed a man wanted in connection with a murder that led to a communal clash in Madhapur village in Gujarat's Kutch district even as heavy police deployment remained in the area to avoid any untoward incident. A group of members from a community attacked and vandalised shops and a place of worship of another social group on Friday evening in Madhapar.

ప్రధాని మోదీ స్వరాష్ట్ర పర్యటన.. గుజరాత్ లో మతఘర్షణలు..

Posted: 08/27/2022 02:48 PM IST
Communal clashes erupt in bhuj after man stabbed to death

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో మరోసారి మతఘర్షణలు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతున్న వేళ.. చలరేగిన ఈ ఘర్షణలు ఎక్కడికి దారితీస్తాయోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. ఇక దీనికి తోడు ఇవాళ స్వయంగా ప్రధాని మోదీ కూడా స్వరాష్ట్ర పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లర్లు సంభవించడం గమనార్హం. రాష్ట్రంలని కచ్‌ జిల్లాలోని భుజ్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భుజ్‌లోని మాధాపూర్‌లో పాల వ్యాపారం నిర్వహించే ఓ యువకుడు హత్యకు గురయ్యాడు.

అయితే పాలవ్యాపారి మరణానికి ఒక వర్గం వారే కారణమని భావించిన ప్రత్యర్థి వర్గం.. వారికి సంబంధించిన ప్రార్థనా మందిరంపై దాడికి దిగారు. ఆ వర్గానికి చెందిన ప్రార్థనామందిరాన్ని ధ్వంసం చేయడంతోపాటు దాని సమీపంలోని షాపులపై దాడి చేశారు. దీంతో రంగంలోకిదిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రెండు వర్గాల పెద్దలను వారిస్తూనే.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా బలగాలను మోహరించారు. ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయని అధికారులు తెలిపారు.

ప్రజలు శాంతియుతంగా ఉండాలని, ఎలాంటి పుకార్లను నమ్మొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. పాలవ్యాపారి మరణం కేసుతో పాటు రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న ఘటనలపై కూడా కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రధాని మోదీ గుజరాత్‌ పర్యటన నేపథ్యంలో అల్లరు చోటుచేసుకోవడం గమనార్హం. ప్రధాని మోదీ ఇవాళ అహ్మదాబాద్‌లో పలు అభివృద్ధిపనులను ప్రారంభించనున్నారు. సబర్మతి నదిపై నిర్మించిన పాదచారుల వంతెనను ఆరంభించారు. దానికి అటల్‌ బ్రిడ్జిగా నామకరణం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Communal clashes  Bhuj  man stabbed to death  Murderer nabbed  Madhapur  Kutch  Gujarat  crime  

Other Articles