Man removes thumb skin, puts on proxy for Railway Exam రైల్వే ఉద్యోగ పరీక్షల్లో ఛీటింగ్: అడ్డంగా బుక్కయిన స్నేహితులు

Job aspirant removes thumb skin pastes on friend s hand to appear for exam

Railway Recruitment Test, Railway job aspirant, Aadhaar card, biometric verification, exam supervisor, proxy candidate, sanitiser, Thumb skin, Manish Kumar, Bihar, cheating, Rajyaguru Gupta, Munger district, Vadodara police, Vadodara, Gujarat, Crime

In a desperate attempt to get a railway job, a candidate removed his thumb skin using a hot pan and pasted it on his friend's thumb with a hope that the latter will clear the biometric verification and appear for the recruitment exam in his place. But, the thumb skin pasted on the proxy's hand fell off when the exam supervisor sprayed a sanitiser on it during the biometric verification before the railway recruitment test conducted in Gujarat's Vadodara city.

రైల్వే ఉద్యోగ పరీక్షల్లో ఛీటింగ్: అడ్డంగా బుక్కయిన స్నేహితులు

Posted: 08/25/2022 09:36 PM IST
Job aspirant removes thumb skin pastes on friend s hand to appear for exam

రైల్వేఉద్యోగ పరీక్షలో గట్టేందుకు ఓ అభ్యర్థి తన అతితెలివి ప్రదర్శించి అడ్డంగా బుక్కయ్యాడు. రైల్వే పరీక్షలలో తనకు బదులుగా స్నేహితుడితో పరీక్ష రాయించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. అదెలా అంటే బయోమెట్రిక్‌ గుర్తింపు కోసం తన బొటనవేలు చర్మాన్ని స్నేహితుడి వేలుకు అంటించాడు. అయితే కరోనా కారణంగా అందుబాటులోకి వచ్చిన శానిటైజర్ వారి ఆటను కట్టించింది. అదెలా అంటే పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థి కాసింత భయాందోళనకు గురయ్యాడు. దీంతో అతనిని అనుమానించిన పర్యవేక్షకుడు చేతిపై శానిటైజర్‌ పోయగా అతికించిన చర్మం కాస్తా ఊడిపోయింది. దీంతో నకిలీ అభ్యర్థితోపాటు అసలు అభ్యర్థిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

గుజరాత్‌లోని వడోదరలో ఈ సంఘటన జరిగింది. బీహార్‌లోని ముంగేర్‌ జిల్లాకు చెందిన 20 ఏళ్ల మనీష్‌ కుమార్‌, ఎలాగైనా రైల్వేలో ఉద్యోగం సాధించాలని అనుకున్నాడు. డీ గ్రూప్‌ పోస్టు కోసం దరఖాస్తు చేశాడు. అయితే చదువులో మెరుగైన తన క్లాస్‌మేట్‌, స్నేహితుడు రాజ్యగురు గుప్తాతో రైల్వే ప్రవేశ పరీక్ష రాయించాలని భావించాడు. దీనికి అతడి సహాయం కోరి ఒప్పించాడు. కాగా, పరీక్ష కేంద్రం వద్ద బయోమెట్రిక్‌ గుర్తింపులో స్నేహితుడే తానుగా నమ్మించేందుకు మనీష్‌ కుమార్‌ ప్లాన్‌ వేశాడు. అయితే బయోమెట్రిక్ ఆధారంగా పరీక్షలు జరుగుతున్న విషయం కూడా తెలిసిన మనీష్.. అదే తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశాడు.

ఒక్క వారం, పది రోజులు కష్టపడినా పర్వాలేదు, కానీ ఉద్యోగం అంటూ వస్తే మాత్రం తాను జీవితాంతం సుఖంగా ఉండవచ్చునని భావించి తన ప్లాన్ ను అమలు చేశాడు. సరిగ్గా పరీక్షకు ముందు రోజు కాలుతున్న పెన్నంపై తన బొటనవేలు ఉంచాడు. వేడికి కమిలి ఊడిన పైచర్మాన్ని మెల్లగా తొలగించి రాజ్యగురు గుప్తా కుడి చేయి బొటనవేలికి అంటించాడు. రైల్వే పరీక్షకు తనకు బదులుగా స్నేహితుడ్ని గుజరాత్‌కు పంపాడు. ఈ నెల 22న వడోదరలోని లక్ష్మీపుర ప్రాంతంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి మనీష్‌ కుమార్‌ తరుఫున అతడి స్నేహితుడు రాజ్యగురు గుప్తా హాజరయ్యాడు.

అయితే బయోమెట్రిక్‌ గుర్తింపు కోసం బొటనవేలితో ప్రయత్నించగా పలుసార్లు విఫలమైంది. మరోవైపు, రాజ్యగురు గుప్తా తన కుడి చేతిని ఫ్యాంటు జేబులో దాచి ఉంచడంతో పరీక్షా పర్యవేక్షకుడు అనుమానించాడు. తనిఖీ కోసం కుడి చేతి బొటనవేలిపై శానిటైజర్‌ పోశాడు. దీంతో అంటించిన చర్మం ఊడింది. ఈ నేపథ్యంలో రాజ్యగురు గుప్తాను పోలీసులకు అప్పగించారు. అతడు అసలు విషయం చెప్పడంతో రైల్వే పరీక్షలో మోసం చేసేందుకు ప్రయత్నించిన అసలు అభ్యర్థి మనీష్‌ కుమార్‌తోపాటు చీటింగ్‌కు సహకరించిన స్నేహితుడు రాజ్యగురు గుప్తాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles