Plane stopped mid-flight and was floating in the sky ఆకాశంలోనే నిలిచి.. గాలిలో తేలుతూ.. వింత‌గా విమానం!!

People spot glitch in the matrix as plane stops mid flight and left floating in the sky

Plane stuck mid-air, glitch in the matrix, Plane floating, Plane freezing mid-air, TikTok video, TikToker @jenniferireneotto, Reddit, Plane stops mid air, Plane stopping mid air viral video, video viral

The glitch in the matrix moment was originally captured by TikToker @jenniferireneotto with some background commentary. "Everybody, sees me walking. Look, this plane isn't moving. But it sounds like it's moving," the TikToker is heard saying in the video. Other people on the street can be seen pointing their phones to the sky to film the plane. The post was captioned: “Anyone can explain? Or is it just a glitch in the matrix?”

ITEMVIDEOS: భూమికి గురుత్వాకర్షణ శక్తి తగ్గిపోయిందా.! ఆకాశంలో తేలుతూ వింత‌గా విమానం!!

Posted: 08/25/2022 08:11 PM IST
People spot glitch in the matrix as plane stops mid flight and left floating in the sky

భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందన్న విషయం తరగతి విద్యార్థలు నుంచి అందరికీ తెలిసిందే. అయితే ఆ గురుత్వాకర్షణ శక్తి ఇప్పుడేమైనా తగ్గిందా.? అన్న అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయి. ఎందుకలా.? అంటే గాల్లో ఉన్న ఓ విమానం అలా ఆకాశంలో ఆగిపోయింది. గాలిలో తేలియాడుతున్న‌ది. అయినా ఏ మాత్రం భూమి గురుత్వాకర్షణ శక్తికి కిందకు రాకుండా అది గాల్లోనే ఉంది. అలా కొంత సమయం పాటు అలానే గాల్లో తేలియాడుతూ ఉండటం స్థానికులను విస్మయానికి గురిచేసింది. ఔరా అలా ఎలా విమానం గాల్లో నిలిచిపోయిందని వింతగా చూశారు.

గాల్లో విమానం ఉందంటే రైయ్ రైయ్ అంటూ దూసుకుపోతుంది. కనురెప్పి మూసితెరిచే లోగా వేగంగా తన పయనాన్ని సాగించే విమానం.. ఏ మాత్రం కదలకుండా అలా నిలిచిపోయింది. ఈ వింతను చూసిన టిక్ టాకర్లు, యూట్యూబర్లు తమ సెల్ ఫోన్లకు పనిచెప్పారు. ఈ వింతను గ్లిట్చస్ ఇన్ ది మాట్రిక్స్ అంటూ తమ  కెమెరాల్లో బంధించారు. ఈ క్లిప్ టిక్‌టాక్‌లో వైర‌ల్ అయ్యింది. అనంత‌రం అన్ని సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాంల‌పై చ‌క్క‌ర్లు కొట్టింది. కారులో వెళ్తున్న వ్య‌క్తి ఈ విమానాన్ని వీడియో తీశాడు.

తాను కారులో ముందుకు క‌దులుతున్నాన‌ని, కానీ, విమానం ఆకాశంలో అక్క‌డే ఉండిపోయింద‌ని వీడియోలో ఆ వ్య‌క్తి పేర్కొన్నాడు. ఇలాంటి దృగ్విషయం కెమెరాకు చిక్కడం, నెటిజన్లను షాక్‌కు గురిచేయ‌డం ఇదే మొదటిసారి కాదు. ‘వైర‌ల్‌హ‌గ్‌’ షేర్ చేసిన మరో వీడియోలో కదులుతున్న కారులో కూర్చున్న వ్యక్తి వ్యతిరేక దిశలో వెళ్తున్న విమానాన్ని బంధించాడు. ఆ విమానం ఏ మాత్రం కదలడం లేదు. డల్లాస్/ఫోర్ట్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఇలాంటి వీడియో ఒకటి వెలుగుచూసింది.

ఈ వీడియో 2018లో యూట్యూబ్‌లో క‌నిపించింది. అయితే, దీని వెనుక సైన్స్ దాగి ఉంద‌ని నిపుణులు పేర్కొన్నారు. వాస్తవానికి ఆకాశంలో చిక్కుకున్నట్టు కనిపించే విమానాలు ‘ఆప్టికల్ ఇల్యూజ‌న్’ అని తెలిపారు. ‘విమానాలు తరచూ ఎదురుగాలి, టెయిల్ విండ్ గుండా వెళ్తాయి. ఒక టెయిల్‌విండ్ విమానం దిశలో వీస్తున్నప్పుడు, విమానం కదిలే దిశకు వ్యతిరేకంగా ఎదురుగాలి వీస్తుంది. చాలా బలమైన ఈదురు గాలుల కారణంగా విమానాలు గాల్లోనే ఆగిపోయిన‌ట్టు కనిపిస్తున్నాయి. కానీ వాస్తవానికి చాలా చాలా నెమ్మదిగా కదులుతాయి.’ అని వివ‌రించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles