Horrific Racist Attack In Texas against Indian women అమెరికాలో భారతీయ మహిళలపై జాతి వివక్ష, దాడి..

Go back to india we don t want you here woman faces charges after plano texas parking

Texas Racist Attack On Indians, Dallas Racist Attack On Indians, Racist Attack on Indians in US, Racist attack, Mexican woman, racist attack in america, racist attack on indians, texas racist attack, Racist attack on Indians, racism, texas, Indian people, indians in america, indian americans attacked, indian women attacked, texas indian population, Trending news, Trending video

Four Indian-American women have been racially abused and smacked by a Mexican-American woman in the US state of Texas who hurled racist slurs at them that they are "ruining" America and should "go back to India". The incident took place in a parking lot in Dallas, Texas. The woman, who has now been arrested, is seen in the video identifying herself as a Mexican-American and assaulting a group of Indian-Americans.

అమెరికాలో భారతీయ మహిళలపై జాతి వివక్ష.. దాడి చేసిన మెక్సికన్..

Posted: 08/26/2022 12:12 PM IST
Go back to india we don t want you here woman faces charges after plano texas parking

అగ్రరాజ్యం అమెరికాలో నలుగురు భారత సంతతి మహిళలు అమెరీకాయేత మహిళ చేతిలో జాతి వివక్షకు గురయ్యారు. ఓ టెక్సాస్​ మహిళ.. వారిని తీవ్రంగా దూషించింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. టెక్సాస్​లోని డల్లాస్​లో స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నలుగురు ఇండియన్​ అమెరికన్​ మహిళలను ఓ చోట కలసి మాట్లాడుకుంటున్న తరుణంలో.. వారి చెంతకు వచ్చిన మెక్సికన్ మహిళ వారిపై జాతి విద్వేష వ్యాఖ్యలు చేసింది. తమ దేశం నుంచి వెళ్లిపోవాలని.. వారి యాస అమెకు నచ్చడం లేదని తెలిపింది.

అంతేకాదు ముందుగా ఒకరిపై దాడి చేసిన మహిళ ఆ తరువాత ఒక్కోక్కరిగా మొత్తం ముగ్గురు భారతీయ మహిళలపై దాడి చేసి.. అగ్రరాజ్యం నుంచి వెళ్లిపోవాలని డిమాండ్​ చేసింది. "ఐ హేట్​ యూ ఇండియన్స్​. మంచి జీవితం కోసం మీరు మా దేశానికి వచ్చారు. ఇక్కడ అంతా ఫ్రీగా కావాలని ఆశిస్తున్నారు. నేను ఓ మెక్సికన్​-అమెరికన్​. నేను ఇక్కడే పుట్టాను," అని వైరల్​ వీడియో ఆ మహిళ గట్టిగా అరవడం కనిపించింది. ఆ మహిళ పేరు ఎస్మెరాల్డా అప్టన్ అని తెలుస్తోంది. ఈ వీడియోను.. బాధితుల్లో ఒకరు తమ కెమెరాలో బంధించారు. బాధితుల్లో ఒకరు.. ఆ మహిళను శాంతిపజేసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.

"మేము అమెరికన్లము కాదని మీకు ఎందుకు అనిపిస్తోంది?" అని ఓ బాధితురాలు అడగ్గా.. "మీరు మాట్లాడే విధానంతో(యాక్సెంట్​) అంతా తెలిసిపోతోంది. నేను మెక్సికన్​- అమెరికన్​. అందుకే నేను ఇంగ్లీష్​లో మాట్లాడుతున్నా," అని అప్టన్​ బదులిచ్చింది. "ఇండియాలో జీవితం బాగుంటే.. మీరు అమెరికాలో ఎందుకు ఉంటున్నారు? అక్కడికే వెళ్లిపోండి," అని ఆ మహిళ గట్టిగా అరవడం వైరల్​ వీడియోలో రికార్డు అయ్యింది. బాధితురాలు.. కెమెరాలో వీడియో తీస్తుండటాన్ని చూసిన అప్టన్​.. ఆమెపై దాడికి దిగింది. కెమెరా ఆఫ్​ చేయాలని డిమాండ్​ చేసింది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. నెటిజన్లు ఆ మహిళపై మండిపడుతున్నారు.

దీనిని హేట్​ క్రైమ్​గా పరిగణించి.. ఆ మహిళను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేస్తున్నారు. తక్షణమే చర్యలు చేపట్టాలని సోషల్​ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. "ఇది చాలా భయంకరంగా ఉంది. ఆమె వద్ద గన్​ ఉంది. ఇంగ్లీష్​లో మాట్లాడుతుంటే.. వేరే యాక్సెంట్​ వస్తోందన్న కారణంగా.. ఆ మహిళ.. ఆ భారత సంతతి మహిళలను చంపేందుకు సిద్ధపడింది. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలి," అని డెమొక్రటిక్​ పార్టీ కార్యకర్త రీమా రసూల్​ ట్వీట్​ చేశారు. ఘటనపై స్పందించిన టెక్సాస్​ పోలీసులు.. నిందితురాలిని అరెస్ట్​ చేసినట్టు వివరించారు. హేట్​ క్రైమ్​ కింద దర్యాప్తు చేపట్టినట్టు స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles