Mountain Goat Freeing Itself From Clutches Of Eagle బతుకుపోరు: డేగకు చిక్కినా.. పోరాడి తప్పించుకన్న కొండ మేక

Viral video shows mountain goat freeing itself from clutches of eagle

eagle vs goat, eagle vs mountain goat, Eagle, eagle hunting, Mountain goat video, mountain goats viral video, eagle video viral, eagle attack video, shocking video, trending video, Wildlife video, viral video

Eagles usually fly very high in the air and have the ability to see for miles. And a grip strength of about 750 pounds per square inch (stronger than the jaws of a lion) makes these flying raptors truly savage killers. But in this video, the land-dwelling animal did the unthinkable to get out of the eagle's grip. On the verge of losing its final fight against the bird, the goat threw itself down the mountain in a last-ditch attempt to live, as seen in the video circulating on Reddit.

ITEMVIDEOS: బతుకుపోరు: డేగకు చిక్కినా.. పోరాడి తప్పించుకన్న కొండ మేక

Posted: 08/19/2022 07:02 PM IST
Viral video shows mountain goat freeing itself from clutches of eagle

జీవనం కోసం జరిగే పోరాటంలో ఎన్నో సమస్యలను అధిగమించడం.. ఎందరెందరో శత్రువులను ఎదుర్కోనడం మనకు తెలిసిందే. మన ఉనికి చాటుకునే ప్రయత్నం చేయకపోతే.. మనం మనుగడే కష్టం. కంటికి కనబడని శత్రువులతోనే కాదు మనిషి తన మనుగడ కోసం ఎంతోమంది శత్రువులను పరాజితుల్ని చేస్తూనే ఉంటాడు. అయితే ఈ పోరాటం కేవలం మనుషులకు మాత్రమే పరిమితమా.? లేక జీవరాశులనీ ఈ పోరాటాన్ని సాగించాల్సిందేనా..? అంటే అన్ని జీవరాశాలు ఈ పోరాటం చేయాల్సిందే. అప్పుడే అవి బతుకుతాయి. ఇది చిన్నప్పుడు విన్న పద్యాన్ని గుర్తు చేస్తుంది. చిన్న చేపను పెద్ద చేప.. పెద్ద చేపను సోర చేప.. ఇలా అన్ని తమ జీవనం కోసం ఇతర ప్రాణులను ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో హరించి.. తమ ఉనికి చాటుకోవాల్సిందే.

ఇలాంటి అనేకరకాలైన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం. అయితే ఇలాంటిదే ఒక వీడియో తాజాగా నెట్టింట్లో అప్ లోడ్ అయ్యింది. ఇక సాధారణ వీడియోల మాదిరిగా కాకుండా ఏకంగా గంటల వ్యవధిలోనే మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఆకలి గొన్న ఒక పెద్ద డేగ.. దృష్టి ఒక కొండ మేకల గుంపుపై పడింది. దానిని చూస్తూనే అందులో ఒక మేకను డేగ టార్గెట్ చేసింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాన్ని వేటాడింది. అయితే డేగకు తెలియదు ఆ మేకే తన తుది మజిలీ అవుతుందని. ఎన్నో మేకలను ఎత్తుకెళ్లిన ఆ డేగ.. తన ఆకలిని తీర్చుకోగా, ఈ మేకతో మాత్రం తన ఆయుర్థాయం తీరిపోతుందని చాలా ఆలస్యంగా తెలుసుకుంది.

ఔనా అదెలా సాధ్యం అసలు డేగను మేక ఎలా సంహరిస్తోంది. అయినా మేకలు జీవాలను సించవు.. ఇక అవి గడ్డినే తింటాయి తప్ప మాంసాహారులు కూడా కావు. కానీ దీనిని సాధ్యం చేసిందీ ఆ మేక. ఆ వివరాల్లోకి వెళ్లే.. ఒక కొండ మేకను టార్గెట్ చేసిన డేగ.. దాని దృఢమైన కాళ్ల గోళ్లతో దానిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో డేగకు చిక్కిన ఆ మేక తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయినా ఫలితం కనిపించలేదు. జీవన్మరణ పోరాటంలో ఓటమిని అంగీకరించని ఆ మేక చివరి ప్రయత్నం చేసింది. కొండ పైనుంచి కిందకు వేగంగా పరుగెత్తి ఆ భారీ పక్షి నుంచి ప్రాణాలతో బయటపడింది. ఈ పరుగలో ఏకంగా డేగను వదిలించుకునే ప్రయత్నం చేస్తూనే కొండకు బలంగా డేగను ఢీకొట్టేలా చేసింది. ఆ తరువాత కొండ కింద రాళ్లకు కూడా దానిని పడేలా చేసి ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో డేగ తన ప్రాణాలను వదిలింది.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. సాధారణంగా ఈగల్స్ గాలిలో చాలా ఎత్తు వరకు ఎగురుతాయి. అంత ఎత్తు నుంచి కూడా కింద ఉన్న సూక్ష్మవైన వాటిని చూసే సామర్థ్యం వాటికి ఉంది. ఇక ఈగల్స్‌ పట్టు గురించి చెప్పక్కర్లేదు. 3.5 అడుగుల పొడవున్న ఈ పక్షులకు ఎనిమిది అడుగుల పొడవైన రెక్కలుంటాయి. కాగా, ఒక కొండ మేకపై డేగ దాడి చేసిన వీడియోను రెడ్డిట్‌లో బుధవారం పోస్ట్‌ చేశారు. దాని బారి నుంచి తప్పించుకునేందుకు ఆ మేక తెగ ప్రయత్నించింది. కొండ పైనుంచి కిందకు పరుగెత్తింది. మధ్యలో బండరాయిని కూడా ఢీకొట్టింది. అయినప్పటికీ ఆ డేగ దానిని విడిచిపెట్టలేదు. చివరకు ఆ డేగ పట్టు నుంచి మేక బయటపడింది. అయితే ఆ మేకను కాపాడేందుకు మరో మేక కూడా వాటి వెంట పరుగులు తీసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో అప్పుడే 10 మిలియన్ల మంది వీక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eagle  eagle hunting  Mountain goat video  mountain goats viral video  eagle video viral  

Other Articles